
అంతేకాదు, ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడంలోనూ ఆమె పాత్ర ఉందని, ఉద్యమం ఉవ్వెత్తున పైకెగసిన తర్వాత శశికళ స్వయంగా రంగంలోకి దిగి ఆందోళనను విరమింపజేసి ఆ క్రెడిట్‌ను తాను కొట్టేయాలని భావించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఉద్యమకారులకు నీళ్లు, ఆహారం అందించింది కూడా శశికళ వర్గీయులేనని అంటున్నారు.
అయితే ఆందోళనకారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి శశికళ చేయి దాటిపోయింది. జల్లికట్టు క్రీడ నిర్వహణకు వీలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చాం కాబట్టి ఆందోళనను విరమించాలంటూ ఆమె పంపిన సందేశాన్ని నిరసనకారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహంచిన శశికళ, అప్పటి వరకు వారికి అందించిన అన్నపానీయాల సరఫరాను నిలిపివేశారని తమిళనాట గుసగుసలు వినపడుతున్నాయి.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…