రీమేక్ అని ఒప్పుకోలేకపోతున్నాడుగా

Jana Nayagan advance bookings

మరో రెండు రోజుల్లో విడుదలకానున్న “జన నాయకుడు” సినిమాకి ఎందుకో సంక్రాంతి టైంలో ఉన్నంత బజ్ గానే హైప్ కానీ లేదు. సంక్రాంతి రిలీజ్ టైంలో.. ఓవర్సీస్ లో కేవలం ప్రీసెల్స్ 3 మిలియన్ ఉండగా.. ఇప్పుడు కనీసం 2 మిలియన్ కూడా లేదు. ఇండియాలో పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. తమిళంలో ఆల్ టైమ్ రికార్డ్ అనుకున్నారు కానీ.. ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇక తెలుగులో కనీసం బుకింగ్స్ ఓపెన్ అయినా మొత్తం గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తోంది.

అయితే.. జన నాయకుడు మన బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” సినిమాకి రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఏది చూసినా ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ లానే ఉంది. కానీ తమిళ వెర్షన్ దర్శకుడు వినోద్ మాత్రం ఇప్పటికీ కేవలం లైన్ మాత్రమే తీసుకున్నానని, ఫస్టాఫ్ లో మాత్రమే భగవంత్ కేసరి ఛాయలు కనిపిస్తాయని, సెకండాఫ్ లో అస్సలు ఏం ఉండదని చెప్పుకొస్తున్నాడు.

ADVERTISEMENT

నిజానికి ఇది రీమేక్ సినిమానా, స్ట్రయిట్ సినిమానా అనేది విజయ్ ఫ్యాన్స్ పట్టించుకోరు. వాళ్లు విజయ్ ఆఖరి సినిమాని థియేటర్లో చూడాలి అనుకుంటారు. అలాంటప్పుడు ఇది రీమేక్ సినిమా అని ఒప్పుకోవడంలో తప్పేముంది? ఎందుకీ బుకాయింపు.

మిగతా చోట్ల బుకింగ్స్ పరిస్థితి ఎలా ఉన్నా.. తమిళనాడులో మాత్రం ఈ చిత్రాన్ని కనీసం ఏడాది ఆడించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఫ్యాన్స్ అసోసియేషన్స్ & కొన్ని పొలిటికల్ గ్రూప్స్. మరి జనాలు అంతలా ఈ సినిమాని చూస్తారా? తలపతి ఆఖరి కచేరీకి ప్రేక్షకులు, విజయ్ అభిమానులు సరైన వీడ్కోలు ఇస్తారా? అనేది ప్రస్తుతం పెద్ద చర్చ.

ADVERTISEMENT
Latest Stories