
అయితే పోలింగ్ తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులకు పది శాతంపైనే ఓట్లు వస్తాయన్న అంచనాలు నెలకొన్నాయి. రెండు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంకా ఎక్కువే ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో పలుచోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన ఓటర్లు పలు చోట్ల ఒక ఓటు జనసేనకు ఇంకో ఓటు టీడీపీ లేక వైఎస్సార్ కాంగ్రెస్ కు వేసినట్టు తెలుస్తుంది.
ఇటువంటి సందర్భంలో వోటింగ్ సరళిని అంచనా వెయ్యడం కూడా కష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీడీపీకి లాభం చేకూరుతుందా? లేక టీడీపీ ఓటు చీల్చి వైఎస్సార్ కాంగ్రెస్ కు మేలు చేస్తుందా అనేది కూడా చూడాలి. ఇదంతా ఎలా ఉన్నా జనసేన కనీసం 15 సీట్లు గెలిచి పవన్ కళ్యాణ్ తన రెండు సీట్లు గెలిస్తే గానీ ఆ పార్టీకి మనుగడ లేదు అని అనుకునే వారు కూడా ఉన్నారు. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ కనబరిచిన ప్రదర్శన జనసేన రిపీట్ చేస్తే ఆ పార్టీ సంతృప్తిగా ఉండవచ్చు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…