Telugu

జనసేన గురించి విజయసాయి అభిప్రాయం.. సరైనదేనా?

విజయసాయి రెడ్డి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జనసేన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “జనసేనకు పూర్తిస్థాయి అధికారం లేదు. కూటమిలో జనసేన మైనార్టీ పార్టీగా ఉంది. కనుక దానికి గొప్ప ఆశయాలు, ఆలోచనలు ఉన్నప్పటికీ అమలు చేయలేకపోతోంది,” అని అన్నారు.

ఇది వాస్తవేమేనా? అని ఆలోచిస్తే కాదనే చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా, డెప్యూటీ సిఎంగా కీలక పదవులలో ఉన్నారు.

ADVERTISEMENT

డెప్యూటీ సిఎం హోదాలో పవన్ కళ్యాణ్‌ తన సొంత నియోజకవర్గం పిఠాపురం మొదలు ఏజన్సీ ప్రాంతాలలోని మారుమూల గ్రామాల వరకు అనేక అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. పర్యావరణ సమస్యలు సృష్టిస్తున్న పరిశ్రమలపై చట్టబద్దంగా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఆక్రమించిన అటవీ భూములను స్వాధీనం చేయించారు.

ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్‌ తదితరులు పవన్ కళ్యాణ్‌ పట్ల చాలా మర్యాదగా వ్యవహరిస్తూ, సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తున్నారు.

జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్ (ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు), కందుల దుర్గేష్ (పర్యాటకం, సినిమాటోగ్రఫీ, సాంస్కృతికం) శాఖలను సిఎం, సాటి టీడీపి మంత్రుల ఒత్తిళ్ళు లేకుండా స్వతంత్రంగా నిర్వహిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు కూడా చాలా చురుకుగా ఉన్నారు.

కానీ సొంత బలంతో ఏర్పడిన ప్రభుత్వానికైనా అనేక ఆర్ధిక పరిమితులు ఉంటాయి. వాటితో పాటు రాజకీయ, సామాజిక అవసరాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది. కనుక ఏ ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా పనిచేయలేదు.

ఉదాహరణకు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు చేసి ఉండొచ్చు. కానీ అయన సంక్షేమ పధకాలకు, వాటితో ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. కనుక ఆయన ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆయనకు తాన తందానా పాడాల్సి వచ్చింది. సొంత ప్రభుత్వమే అయినా పదవులు అలంకార ప్రాయంగా ఉండేవి. అభివృద్ధి పనుల విషయంలో కూడా ఎవరికీ స్వేచ్చ ఉండేది కాదు. జగన్‌ కోరుకున్నవి మాత్రమే జరుగుతుండేవి.

కానీ కూటమి ప్రభుత్వంలో సిఎం చంద్రబాబు నాయుడు జనసేన మంత్రులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఆర్ధిక పరిమితులకు లోబడి నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. రాజకీయ, సామాజిక అంశాలను, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరూ కలిసి కట్టుగా బాగా పని చేసి ప్రజల మెప్పు పొందాలని మాత్రమే చెపుతున్నారు.

కూటమి ప్రభుత్వంలో జనసేనకు ఉన్న స్వేచ్చ స్వాతంత్ర్యాలు, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్నాయా? మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపికి ఇతర పార్టీలకు ఉన్నాయా? అని ఆలోచిస్తే సంకీర్ణ రాజకీయాలలో కొంత సర్దుబాట్లు తప్పవని అర్ధమవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Lokesh Understood GenZ Issues: Right Analysis!

The Telugu Desam Party has remained one of the prominent political forces in Andhra Pradesh…

34 minutes ago

యాసిడ్ టెస్ట్ ఫర్ కార్తికేయ

ఎస్.ఎస్.కార్తికేయ అనే పేరు తెలియనివారుండరు. రాజమౌళి కొడుకుగా మాత్రమే కాక.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలని ఎగ్జిక్యూట్ చేసిన అసోసియేట్ డైరెక్టర్…

1 hour ago