జనసేన తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యనట్టేనా?

Janasena Party's Insensitive Homage to Araku MLA Kidari Sarvewsara Raoప్రజాపోరాటయాత్రలో భాగంగా పోలవరం ముంపు మండలాలైన కుకునూరు, వేలేరుపాడు పర్యటనకు వెళ్తున్న క్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నిన్న ఉదయం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొద్దిసేపు ఆగారు. పది నిమిషాల పాటు ప్రజలనుద్దేశించి మాట్లాడతారని ప్రచారం జరిగింది. దీంతో జనసేన కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా పేటకు తరలివచ్చారు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఆయన మాత్రం టాప్‌లెస్‌ వాహనంలో నిలబడి అందరికి అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. తొలుత అక్కడ మాట్లాడాలని అనుకున్నా తెలంగాణలో ప్రసంగించి తెలంగాణ ఎన్నికలల గురించి మాట్లాడకపోతే బాగోదని ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు సమాచారం. దీనితో జనసేన తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యనట్టేనా? అని అంతా అనుకుంటున్నారు.

తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యడమే కాదు ఏదైనా ఒక వర్గానికి మద్దతుగా మాట్లాడినా అది ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బంది కలిగించవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. దీనితో ఆయన మొత్తానికి సైలెంట్ అయిపోవడమే మేలని భావిస్తున్నారట. దీనితో ఆ పార్టీ తెలంగాణ నాయకులు అభిమానులు నిరుత్సాహపడిపోయారు.

ADVERTISEMENT
Latest Stories