
Jana Sena and YSRCP social media row
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా టీడీపీ-వైసీపీ మధ్యనే సాగుతుంటాయి. జనసేనను పక్కదారి పట్టించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించడం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. కనుక ఏదో ఒకరోజు దాని ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా లేకపోలేదు.
అయితే ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేనట్లే.. తాము చేతులు కలపకుండా వైసీపీ తమతో రాజకీయాలు చేయలేదని జనసైనికులు గ్రహించడం చాలా అవసరం.
ఉదాహరణకు, ఇటీవల ‘ట్విట్టర్ స్పేస్’లో కొందరు జనసైనికులు వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం గురించి అనుచితంగా మాట్లాడారని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు, జనసేన అధిష్ఠానం ఎలా స్పందిస్తాయనేది తర్వాతి సంగతి.
కానీ జనసైనికులు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే వైసీపీకి ఈ అవకాశం లభించిందని అర్థమవుతుంది కదా? ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న వైసీపీ, వారిపై రాజకీయంగా ఎదురుదాడి చేయకుండా ఉంటుందా? కనుక జనసైనికులు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొదలుపెడితే జనసేన అధిష్ఠానం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి విషయాల్లో వారిని వెనకేసుకు వస్తే వైసీపీ ఆక్షేపిస్తుంది. వారిపై చర్యలు తీసుకుంటే జనసైనికులకు కోపం వస్తుంది. అంటే జనసైనికులను క్రమంగా పక్కదారి పట్టించాలనే వైసీపీ వ్యూహం ఫలించే అవకాశం ఉంటుంది.
కనుక స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి విజయ గర్వాన్ని తలకెక్కించుకోవద్దని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సూచన జనసైనికులకు కూడా వర్తిస్తుంది.
ఒంగోలు జిల్లా జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ను జనసైనికులందరూ తప్పక చూడాలి. క్లుప్తంగా దాని సారాంశం..
“ఈ ఎన్నికల్లో నేను చాలా ఎదురు దెబ్బలు తిని, చాలా నష్ట పోయినప్పటికీ.. నాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి సమయంలో ఎవరు, ఎంత అనూహ్యంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకున్నాను. ఈ గుణపాఠాలు వచ్చే ఎన్నికలకు నాకు బాగా ఉపయోగపడతాయి. ఇక నుంచి అదే లక్ష్యంగా పనిచేస్తాను” అని ఆమె పేర్కొన్నారు.
కనుక వైసీపీ లేదా స్థానికంగా తమ రాజకీయ ప్రత్యర్థుల వలలో చిక్కుకోకుండా జనసైనికులు ఇప్పటి నుంచే జాగ్రత్తపడాలి. పార్టీలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో జనసేన బలాన్ని పెంచుకోవడం పైనే దృష్టి పెట్టి పని చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
Tollywood's box-office situation is becoming increasingly worrying. This week's releases exposed another troubling trend. Several…
నాడు కేసీఆర్ గల్లీలోనే కాదు.. ఢిల్లీలో కూడా ప్రధాని మోదీపై కత్తులు దూస్తుండేవారు. తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం…