Telugu

రాహుల్‌ మెప్పు కోసం కేంద్రంపై రేవంత్‌ కత్తులు దూస్తే..

నాడు కేసీఆర్‌ గల్లీలోనే కాదు.. ఢిల్లీలో కూడా ప్రధాని మోదీపై కత్తులు దూస్తుండేవారు. తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆ పోరాటాలను తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం చేస్తున్న పోరాటాలుగా కేసీఆర్‌ అభివర్ణించుకునేవారు.

ఆయన చేసిన పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆ తర్వాత చేసిన రాజకీయ పోరాటాల వల్ల స్వయంగా ఆయన, కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోయాయి.

ADVERTISEMENT

కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితిని చూసిన సీఎం రేవంత్‌ రెడ్డి, అటువంటి తప్పులు చేయకుండా జాగ్రతపడ్డారు. రాష్ట్రంలో బీజేపీపై కత్తులు దూస్తూనే.. ప్రధాని మోదీతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రధాని మోదీ కూడా రేవంత్‌ రెడ్డి పరిస్థితిని, వైఖరిని అర్థం చేసుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నారు. అయితే రేవంత్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి, దాని ప్రయోజనాలకే పరిమితమైనంత కాలం కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

కానీ రాహుల్‌ గాంధీ మెప్పు కోసం రేవంత్‌ రెడ్డి చేస్తున్న విమర్శలు, రాజకీయాలు ప్రధాని మోదీకి అసహనం కలిగించడం సహజం.

ఓ పక్క తనపై కత్తులు దూస్తూ.. మరోపక్క ఢిల్లీకి వచ్చి తనతోనే భేటీ అయ్యి నిధులు కేటాయించాలని, తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతుండటంపై ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో తెలియదు.

కానీ రాహుల్‌ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టడమే తన ధ్యేయమంటూ సీఎం రేవంత్‌ రెడ్డి పదేపదే చెప్పడం బహుశః ఆయన మెప్పు కోసం కావచ్చు. కానీ రేవంత్‌ రెడ్డి చెప్తున్న ఈ మాటలు, కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ముఖ్యంగా రాహుల్‌ గాంధీ కోసం చేస్తున్న రాజకీయాలతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే అనిపిస్తోంది. అంటే చరిత్ర పునరావృతం కాబోతోందా? అనే సందేహం కలుగుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

జనసైనికులూ.. వైసీపీకి అవకాశం ఇవ్వొద్దు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా టీడీపీ-వైసీపీ మధ్యనే సాగుతుంటాయి. జనసేనను పక్కదారి పట్టించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలించడం లేదు.…

5 minutes ago

Tollywood New Releases: Promotions Full, Collections Nil

Tollywood's box-office situation is becoming increasingly worrying. This week's releases exposed another troubling trend. Several…

20 minutes ago