
టిడిపి, జనసేన, బీజేపీల మద్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి రావడంతో మూడు పార్టీలు అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టిడిపి 94 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, జనసేన 6 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలో 9 మంది అభ్యర్ధులతో సమావేశమయ్యి వారి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసి ఎన్నికల ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఈరోజు టిడిపి రెండో జాబితా ప్రకటించబోతోంది. బీజేపీ కూడా నేడే తమ అభ్యర్ధుల జాబితాని ప్రకటించబోతోందని సమాచారం. వైసీపి ఇప్పటికే 75 ఎమ్మెల్యే, 23 ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. ఎల్లుండి శనివారం తుది జాబితా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తుందో లేదో తెలీని పరిస్థితి.
టిడిపి, జనసేనల మద్య సీట్ల సర్దుబాట్ల తర్వాత జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు లభించగా నిన్న ఖరారు చేసిన 8 మందితో కలిపి ఇంతవరకు మొత్తం 14 ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించిన్నట్లయింది. ఒకటి రెండు రోజులలో మిగిలిన అభ్యర్ధులను కూడా ప్రకటించనున్నారు. శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న జనసేన అభ్యర్ధులు వీరే…
The CBI and ED are tightening their investigations into several high-profile cases linked to Andhra…
BOTTOM LINE Promising Start, Loses Steam RATING 2.5/5 Story, Screenplay, Director: Nelson Dilip Kumar Cast:…