
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్-వీణల వ్యవహారంపై జరిగింది… ఇంకా జరుగుతున్నదీ అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా (ఎవరి పార్టీలని బట్టి వారు) తీర్పులు చెప్పేశారు. కనుక ఈ కేసులో కొత్తగా తీర్పు చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గంభీరంగానే తీసుకున్నారు. అందుకే వెంటనే ముగ్గురు సభ్యులతో క్రమశిక్షణ కమిటీ వేశారు. అరవ శ్రీధర్ నేడు కమిటీ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చుకున్నారు. ఆయన వారికి చెప్పాల్సింది చెప్పుకున్నారు. కనుక క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని తమ అధినేతకు తెలియజేస్తారు. అయన ఏం నిర్ణయం తీసుకుంటారో త్వరలో తెలుస్తుంది.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కమిటీ ముందు సంజాయిషీ ఇచ్చుకొని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఈ వ్యవహారం నాకు- ఆ అమ్మాయికి మద్య జరిగింది. దీంతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదు. కనుక దయచేసి దీనిని జనసేనతో ముడిపెట్టవద్దు,” అని విజ్ఞప్తి చేశారు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…