మనసు మార్చుకున్న పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానూ ఎమ్మెల్యే గా ప్రభుత్వం నుండి పూర్తి జీతం తీసుకుని ప్రజలకు సేవ రూపంలో దాన్ని తిరిగి ఇచ్చేస్తాను అంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు తానూ ఇచ్చిన మాటను తానే వెనక్కి తీసుకుంటున్నానంటూ మరో ప్రకటన చేసారు.

ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపణీ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నేతలు తమ తమ నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత మొదటి సారిగా పిఠాపురం వెళ్లిన పవన్ అక్కడ ఏర్పాటు చేసిన పెన్షన్ ల పంపిణి కార్యక్రమంలో పాల్గొని వృద్దులకు, వికలాంగులకు పెన్షన్ అందించారు.

ADVERTISEMENT

ఆ తరువాత జరిగిన సభలో మాట్లాడుతూ వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాలంటీర్లు లేకుండా కూడా పెన్షన్లను ఇళ్ల దగ్గరకే తీసుకు వచ్చారు కదా.! వాలంటీర్లు లేకపోతే పిషన్లు ఆగాయా.? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 4 , 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈసారి రెండు రోజులలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం.

గతం కంటే రెట్టింపు పెన్షన్ అందిస్తున్న ఈ ప్రభుత్వం వాలంటీర్లకు కూడా ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం అంటూ ప్రకటించారు. పంచాయితీ రాజ్ శాఖ లో సమీక్షలు చేసిన సందర్భంలో ఆ శాఖలో జరిగిన అవినీతి, అప్పులు చూసి తనకు మతిపోయిందని, ఆ అప్పులు చూసాకా తనలాంటి వాడు జీతం తీసుకుని పని చేయడం సబబు కాదని భావించి జీతం తీసుకోకుండా పని చేయాలనీ నిశ్చయించుకున్నానన్నారు.

తన కోసం కొత్త ఫర్నిచర్ కానీ, కొత్తగా మరమత్తులు కానీ ఏమి చేపట్టవద్దని చెప్పా అంటూ ఒక నాయకుడు ప్రజా ధనం పట్ల ఎంత బాధ్యత గా ఉండాలో పవన్ తెలియచేస్తే, జగన్ మాత్రం తన కోసం 500 కోట్ల ప్రజాధనంతో వెచ్చించి రుషికొండ మీద ప్యాలస్ లు కట్టుకుని ప్రజా ధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో తెలియచెప్పారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Harish Shankar: A Strong Message to Vijay’s Trolls

Trolling has become a part of the film industry, especially in the age of social…

18 minutes ago

Varanasi: After Rajamouli, What Options Left for Mahesh?

Mahesh Babu has spent years waiting for a project that can take him to the…

48 minutes ago