
తాజాగా విడుదల చేసిన 4వ వారం పోస్టర్, యంగ్ టైగర్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో హైలైట్ సీన్ గా నిలిచిన రాజీవ్ కనకాల ఎపిసోడ్ నుండి ఈ ఫోర్త్ వీక్ పోస్టర్ ను రూపొందించారు. రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళేటపుడు స్టైలిష్ గా గేటు తీసిన ఈ ఎన్టీఆర్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్ కలర్, ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్, స్టైల్ అదిరిపోయేలా ఉండడంతో… ఈ పోస్టర్ ను షేర్ చేసుకుంటూ బుడ్డోడు అభిమానులు సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం ఆల్ టైం జాబితాలో టాప్ 3లో ఉన్న ‘జనతా గ్యారేజ్’ త్వరలోనే రెండవ స్థానానికి చేరుకుంటుందని జూనియర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ‘మజ్ను’కు మంచి టాక్ రావడంతో, జూనియర్ ఎంతవరకు అభిమానులను ధియేటర్లకు రప్పిస్తాడో చూడాలి. ‘శ్రీమంతుడు’ను దాటి రెండవ స్థానానికి చేరుకుంటే… తారక్ కు, అభిమానులకు అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…