Telugu

రచ్చ లేకుండా “జనతా గ్యారేజ్” వేడుక జరుగుతుందా?

మెగా, నందమూరి కుటుంబ సినిమాల వేడుకలు జరుగుతున్నాయంటే ఏదొక సంచలనం జరుగుతుందని ఎదురుచూడడం మీడియా వర్గీయుల వంతవుతోంది. అందుకు తగ్గట్లుగానే ఎప్పుడూ హాట్ హాట్ విషయాలు నమోదవుతూనే ఉన్నాయి. మరి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న “జనతా గ్యారేజ్” ఆడియో వేడుకపై అధికారిక తేదీ వెలువడింది. దీంతో ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎవరు విచ్చేయనున్నారు? జూనియర్ కాకుండా ఇంకెంత మంది వేదికను అలంకరించబోతున్నారు? అనే విషయాలు అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన “నాన్నకు ప్రేమతో” ఆడియో వేడుక హాట్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బాలకృష్ణ ఊసెత్తకుండా సాగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం ఒక వంతయితే, ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత నేటి జూనియర్ ఎన్టీఆరే గొప్ప అన్నంత రీతిలో సాగిన నందమూరి హరికృష్ణ ప్రసంగంపై జరిగిన రచ్చ అభిమానులకు తెలియనిది కాదు. ఈ వేడుక ద్వారా తారక్ ఫ్యామిలీకి – నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరం బహిర్గతమైనట్లయ్యింది. ఆ తర్వాత ఎంత వివరణ ఇచ్చుకున్నప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యం.

ADVERTISEMENT

మరి, తాజాగా ఈ నెల 12వ తేదీన జరగబోతున్న “జనతా గ్యారేజ్” ఆడియో వేడుక ఇంకెలాంటి సంచలనాలకు దారి తీస్తుందోనన్న చర్చ సినీ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇటీవల కాలంలో మెగా వేడుకలు మరింత హాట్ హాట్ గా మారడంతో ‘ఆడియో’ వేడుకలంటే ‘ఆధిపత్యపు’ ప్రదర్శనలుగా మారిపోతున్నాయి. మరి ‘జనతా గ్యారేజ్’ సినిమా ఆడియో వేడుక అభిమానులు మెచ్చే విధంగా జరుగుతుందో లేక మీడియా వర్గాలకు హాట్ టాపిక్ గా మారే ఆధిపత్యపు వేదికగా మారుతుందో ఈ నెల 12వ తేదీన చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

పక్కలో బల్లెం.. విజయసాయి వచ్చేస్తున్నారుగా

ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…

2 minutes ago

Mahesh Babu with Mamitha Baiju: Is It Really Cooking?

Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…

18 minutes ago