
అయితే ఈ రికార్డులు అన్ని ఏరియాలలో కాదు… గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, వైజాగ్ (ఉత్తరాంధ్ర) వంటి ఏరియాలలో ‘జనతా గ్యారేజ్’ ఆల్ టైం రికార్డులను అందుకుంది. వీక్ డే కావడంతో… గురువారం విడుదలైన సినిమాలకు ఓపెనింగ్స్ కాస్త తక్కువగా ఉంటాయి. కానీ, ‘స్టార్’ పవర్ ఏంటో చాటి చెప్పే విధంగా వీక్ డేలోనూ ‘జనతా గ్యారేజ్’ రికార్డులను వేటాడింది. మరో వైపు అటు యుఎస్ ప్రీమియర్స్ తో కూడా ఆల్ టైం జాబితాలో టాప్ 3 స్థానంలో నిలిచి సత్తా చాటింది.
ఓ పక్కన ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు అందుకోవడం యంగ్ టైగర్ అభిమానులకు నిరాశగా మారగా, మరో పక్కన ఇలా ఆల్ టైం రికార్డులు అందుకోవడం కొత్త ఉత్సాహాన్ని పంచుతోంది. అయితే రానున్న రోజుల్లో టాక్ కాస్త పాజిటివ్ గా మారితే, ‘జనతా గ్యారేజ్’ రికార్డులకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చనేది ట్రేడ్ పండితుల మాట. ప్రస్తుతం మార్కెట్ లో ఎలాంటి చిన్న, పెద్ద సినిమాలు లేకపోవడం కలిసొచ్చే అంశం.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…