
దీంతో మరికొద్ది రోజుల్లోనే ‘జనతా గ్యారేజ్’ బుడ్డోడు అభిమానుల్లో పండగ వాతావరణాన్ని మళ్ళీ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలు ఇలాంటి పోకడను అనుసరిస్తుంటాయి. సినిమా విడుదలైన నెల రోజులకే బుల్లితెరపై ప్రదర్శిస్తుంటారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిర్మాతకు ముట్టచెప్తారు కూడా! తెలుగులో కూడా ఒకటి, రెండు సినిమాలు ఇలా ప్రదర్శితమయ్యాయి గానీ, పెద్ద హీరోల సినిమాలు ఇంత త్వరగా ప్రదర్శితమవడం చాలా అరుదు. అందులోనూ ఆల్ టైం టాప్ 3లో చోటు దక్కించుకున్న సినిమా అప్పుడే ప్రత్యక్షం కావడం జూనియర్ అభిమానులకు పండగేనని చెప్పాలి.
సంక్రాంతికి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమానే ఈ దసరాకు బుల్లితెరపై విడుదల చేసారు. అలాంటిది సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ అక్టోబర్ లోనే ప్రసారం కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టినట్లే భావించాలి. బహుశా… అక్టోబర్ చివరి వారంలో దీపావళి పండగ ఉండడంతో, ఆ సమయంలో “జనతా గ్యారేజ్” బుల్లితెరపై ప్రదర్శితం కావచ్చని అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే, టీవీ రంగంలో సరికొత్త టీఆర్పీ రేటింగ్స్ కు ‘జనతా గ్యారేజ్’ వేదిక అవుతుందేమో చూడాలి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…