Telugu

‘జనతా గ్యారేజ్’కు సక్సెస్ సంబరాలు లేవు!

ఈ నెల 10వ తేదీన ‘జనతా గ్యారేజ్’ విజయోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరిపేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైన విషయం తెలిసిందే. విశాఖలోని ఆర్.కే.బీచ్ లో ఈ వేడుకలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల నుండి అధికారిక సమాచారమే వెలువడింది. అయితే అర్ధంతరంగా ఈ వేడుక కాన్సిల్ అయ్యింది. ఈ సక్సెస్ సంబరాలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో… అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘జనతా గ్యారేజ్’ విజయోత్సవ వేడుకలకు బ్రేకులు పడ్డాయి.

అయితే పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వలేదు? అంటే వినాయక నిమజ్జనాలు ఉన్నాయి గనుక, అనుమతి ఇచ్చేది లేదు అంటూ తేల్చిచెప్పారని తెలుస్తోంది. దీంతో ఈ వేడుకను తాత్కాలికంగా వాయిదా వేసారా? లేక పూర్తిగా రద్దు చేసారా? అన్న సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది. మంచి ఊపులో ఉన్న యంగ్ టైగర్ అభిమానులకు ఇది చేదు వార్తేనని చెప్పవచ్చు. ‘సరైనోడు’ మాదిరే ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకున్న ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ సంబరాలను కూడా ‘సరైనోడు’ మాదిరే విశాఖలో నిర్వహించాలని తలపెట్టిన ప్లాన్ కు అడ్డు పడింది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

GT vs SRH: Big Stars Exposed in Brutal Collapse!

Gujarat Titans delivered a dominating performance against Sunrisers Hyderabad in the 56th match of IPL…

22 minutes ago

Hero’s Toxic Problem, But Producer Happy?

Success and failures can come thick and fast in the film industry as the tide…

43 minutes ago