Telugu

జనవరి 26… విశాఖలో ఏం జరుగుతుందో..?

జనవరి 26… ప్రస్తుతం అందరి దృష్టి ఈ రోజు మీదే ఉంది. కారణం… ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలోని ఆర్కే బీచ్ లో ఆందోళనకు రంగం సిద్ధమవుతోంది. హోదా కోసం ఏపీ యువత ఏకమవుతోంది. పార్టీలకు అతీతంగా శాంతియుతంగా చేపట్టే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత హాజరుకావాలంటూ… గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నిరసనకు జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో, పోలీసులు కలవరపాటుకు గురవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి పవన్ హాజరు కానుండడంతో స్పందన విశేషంగా లభిస్తోంది.

మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే రోజు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండనున్నారు. మరుసటి రోజు నుంచే ప్రతిష్టాత్మక సీఐఐ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం పోలీసులకు కత్తి మీద సామే. అయితే, నిరసన కార్యక్రమం అనుమతి కోసం ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఓ వైపు నిరసన కార్యక్రమం జరుగుతుంటే… అక్కడే ఉన్న ముఖ్యమంత్రికి ఇది ఇబ్బందికర అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారిన పెట్టుబడుల సదస్సుకు ముందు ఇలాంటి పరిణామాలు ఇన్వెస్టర్స్ లో భయానకాన్ని సృష్టిస్తాయనేది విశ్లేషకుల మాట.

ADVERTISEMENT

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47 US BO Day 2: Trivikram Fumbled in His Strong Zone?

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…

8 minutes ago

నారా లోకేష్‌ సూటి ప్రశ్నలు సమాధానం ఉందా?

పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…

13 minutes ago