జయలలిత ‘ఆస్తుల’ చిట్టా విందము రారండి..!

jayalalitha assetsతమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ దాఖలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత త‌న ఆస్తుల వివ‌రాలను వెల్ల‌డించారు. త‌న ఆస్తులు 113.73కోట్లుగా ప్ర‌క‌టించిన జయలలిత, వీటిల్లో స్థిరాస్తుల విలువ 41.63 కోట్లుగా, చరాస్తుల విలువ 72.10 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా ప్ర‌క‌టించిన ఆస్తుల వివ‌రాల ప్ర‌కారం… గ‌తంలో ఉప ఎన్నిక నేపథ్యంలో జ‌య‌ల‌లిత ప్ర‌క‌టించిన ఆస్తుల క‌న్నా ఈ సారి ఆస్తుల విలువ 3.4 కోట్లు తగ్గాయి.

ADVERTISEMENT

ఏఐఏడీఎంకే పార్టీ అధ్యక్షురాలైన జయలలిత చెన్నైలోని రాధాకృష్ణ నగర్‌ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసిన సంగ‌తి తెలిసిందే. గత ఉప ఎన్నికల్లో జయలలిత ఇదే నియోజకవర్గం నుంచి సుమారు లక్షా యాభై వేల భారీ మెజార్టీతో గెలుపొందిన జ‌య‌ల‌లిత‌కు ఈ సారి ప‌రిస్థితులు క్లిష్టంగా మారాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీల ఐక్యతతో జయలలితకు గట్టి పోటీ ఎదురుకానుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories