
ఒక వారం ముందే నెట్టింట్లో “పెళ్లిచూపులు” సినిమాకు సంబంధించిన రివ్యూలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో సాధారణ ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే సినిమా పబ్లిసిటీలో భాగంగా, తమ సినిమాపై ఉన్న నమ్మకంతో జర్నలిస్టులకు, ప్రముఖ సినీ సంబంధీకులకు “పెళ్లిచూపులు” సినిమా స్పెషల్ షోలు వేసి మరీ చూపించారు. దీంతో ఈ సినిమా ఫుల్ పాజిటివ్ మోడ్ లో విడుదలై, ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
తాజాగా ఇదే బాటలో “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమా కూడా పయనిస్తోంది. మరికొద్ది గంటల్లో విడుదల ఉందనగా, ఈ సినిమా ప్రివ్యూలను సినీ ప్రముఖులకు, విలేఖరులకు ప్రదర్శించడంతో… ఈ సినిమా టాక్ కాస్త విడుదలకు ముందే బయటకు వచ్చేసింది. ‘పెళ్లిచూపులు’ మాదిరే ‘జయమ్ము నిశ్చయమ్మురా’కు కూడా ఫుల్ పాజిటివ్ రివ్యూలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి సక్సెస్ అయినట్లే అన్న టాక్ సర్వత్రా వినపడుతోంది.
వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.?…
చిత్రం: రంభ ఊర్వశి మేనక M9 రేటింగ్: 1.5/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026 తారాగణం: అల్లరి నరేష్,…