జగన్ ప్రభుత్వంపై కోర్టుకి వెళ్ళబోతున్న జేసీ?

JC Diwakar Reddy on elections 2019 expensesజగన్ ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగానే తనకు చెందిన ట్రావెల్‌ బస్సులను సీజ్‌ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఆరోపించారు. చిన్నా చితకా కారణాలతో ఇప్పటివరకు 85 బస్సులను అధికారాలు సీజ్ చేశారని, ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు ఇచ్చినా 15 బస్సులను ఆర్టీఏ అధికారుల ఆధీనంలోనే ఉంచుకున్నారని జేసీ వారించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ లోకి రావాలని ఓ పెద్ద మనిషి తనను ఆహ్వానించారని చెప్పారు. పార్టీ మారకపోతే కేసులు తప్పవని బెదిరించారని జేసీ ఆరోపించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ఇంతకముందే చెప్పానని గుర్తుచేశారు. చిన్న,చిన్న కారణాలతో కూడా సీజ్ చేస్తున్నారని, దీనిపై కోర్టుకు వెళతామని ఆయన అన్నారు.

ADVERTISEMENT

ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, హద్దులు దాటి వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.పర్మిట్ లేని ఒక్క బస్సునైనా చూపిస్తారా అని జేసీ సవాల్ విసిరారు.ఛీప్ సెక్రటరీని కూడా మాట వినడం లేదని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జేసీ జగన్ ను తరచూ విమర్శించే వారు… దానికి ప్రతిగానే ఇది జరుగుతుందని పలువురి అభిప్రాయం.

ఇది ఇలా ఉండగా ఎన్నికల ఫలితాలు రాకముందు నుండీ జేసీ కుటుంబం పార్టీ మారుతుందని వార్తలు వచ్చేవి. మొదట్లో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కు వెళ్తారని ఆ తరువాత బీజేపీ అని అనేవారు. అయితే ప్రస్తుతానికి ఆ రెండు జరగలేదు. ప్రభుత్వ కక్ష సాధింపు నేపథ్యంలో జేసీ ఏం చెయ్యబోతున్నారో చూడాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories