
వైఎస్ జగన్‌పై కేసులు నమోదు చేసి, విచారణాధికారిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ఇటీవలే జరిగిన ఎన్నికలలో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో సాక్షి సంబరాలు అంబరాన్ని అంటాయి. 1500 కోట్లే 1500 కోట్లే అంటూ తమ పేపర్ లోనూ, టీవీలోనూ ఊదరగొడుతుంది. జగన్ కు ఏదో క్లీన్ చిట్ ఇచ్చేసినట్టుగా ఆనందపడిపోతుంది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఇందులో సంబరపడాల్సింది ఏమీ లేదని అంటున్నారు.
“1500 కోట్లు అనేది ప్రభుత్వ రిజిస్టర్డ్ వేల్యూ. బహిరంగ మార్కెట్ లో వీటి విలువు ఎన్నో రేట్లు ఎక్కువ ఉండొచ్చు. విచారణ సంస్థలు ప్రభుత్వ రిటైర్డ్ వేల్యూ గురించే మాట్లాడతారు. దాదాపుగా 40000 కోట్లు వరకు ఉండొచ్చు,” అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా అసలు లక్ష కోట్ల అవినీతే అవినీతి అసలు 1500 కోట్లు అంటే పట్టించుకో అక్కర్లేదు అన్నట్టు ఉంది జగన్ మీడియా వరుస. ఇంకా నయం ఇదే పాయింట్ మీద కేసులు కొట్టేయాలని కోర్టులలో వాదించలేదు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…