
ఒక సివిల్ సర్వీస్ ఉద్యోగిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన జేడీ లక్ష్మి నారాయణ రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు.
2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమిని అందుకున్న జేడీ అటు పిమ్మట జనసేనకు కూడా రాజీనామా చేసి 2023 లో ‘జై భారత్ నేషనల్ పార్టీ’ అంటూ సొంత రాజకీయ పార్టీని స్థాపించారు.
అయితే ఇక్కడ కూడా జేడీ కి ఓటమే ఎదురయ్యింది. ఈసారి జేడీ గతంలో కంటే తక్కువ ఓట్లు దక్కించుకోవడమే కాదు అసలు ఏపీలో జేడీ పార్టీ ఒకటి ఉంది అనే ఆనవాళ్లు కూడా లేకుండా డిపాజిట్లు కోల్పోయారు.
ఇలా సివిల్ సర్వీస్ ఉద్యోగంతో కూడకట్టున్న పేరు మొత్తం పాలిటిక్స్ లో పోగొట్టుకోవడం, అలాగే అక్కడ సక్సెస్ చూసిన లక్ష్మి నారాయణ ఇక్కడ పూర్తిగా ఫెయిల్యూర్ గా మారడం ఆయన రాజకీయ జీవితం గమ్యం లేని ప్రయాణం మాదిరి మారిపోయింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూటమి vs వైసీపీ గా సాగుతున్న ఈ రాజకీయ కురుక్షేత్రంలో మరో పార్టీకి ఆస్కారమే లేకుండా పోయింది. దీనితో ఇక తన ఫెయిల్యూర్ పొలిటికల్ కెరీర్ కి ఎండ్ కార్డు వేస్తూ జేడీ మరోకొత్త ప్రయాణం మొదలుపెట్టారు.
సిబిఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రవైట్ లిమిటెడ్ కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా జాయిన్ అయ్యారు.
అయితే ఒక సివిల్ ఉద్యోగిగా తన ఉద్యోగ జీవితాన్ని సైతం త్యాగం చేసి మరి రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలు ఒంట బట్టక తిరిగి మరల ఒక ఉద్యోగి గానే తన ప్రాయాణాన్ని సాగించడానికి సిద్ధమయ్యారు జేడీ. ఓలెక్ట్రా అనే ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసే కంపెనీలో ఉద్యోగిగా ప్రయాణం మొదలుపెట్టనున్నారు.
అయితే ఇదే కోవకి చెందిన జయప్రకాశ్ నారాయణ కూడా గతంలో లోక్ సత్తా అనే పొలిటికల్ పార్టీతో రాజకీయాలలోకి వచ్చి సక్సెస్ కాలేక రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఇక ఇప్పుడు జేడీ కూడా తన ఈ నిర్ణయంతో తన పొలిటికల్ జర్నీ కి ఎండ్ కార్డు వేసినట్టే అనుకోవాలి.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…