Telugu

జీవన్ రెడ్డి వ్యాఖ్యలు…బీజేపీ – బిఆర్ఎస్ పొత్తుకు నాందా.?

కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి త్వరలో బిఆర్ఎస్ కారెక్కబోతున్న జీవన్ రెడ్డి రేవంత్ సర్కార్ ను ఉద్దేశించి చేసిన విమర్శలు, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల పై కురిపించిన ప్రశంసలు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంసంగా మారాయి.

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాని కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే మెరుగ్గా ఉందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయిన ప్రతి రైతు కి న్యాయం జరిగిందని, అమలు కానీ ఎన్నికల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందంటూ వాపోయారు జీవన్.

ADVERTISEMENT

అటు ఉద్యోగులను ఇటు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తూ రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంటుందన్నారు. ఇలా ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే మరోపక్క ఇటు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ అటు కేంద్ర స్థాయిలో బీజేపీ బెటర్ అంటూ ఆ రెండు పార్టీల పై ఆయా పార్టీల నాయకత్వం పై ప్రశంసలు కురిపించారు.

రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ చాల మెరుగైన పాలన అందించారని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి జరిగితే నేటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విధ్వంశం జరుగుతుందన్నారు. అలాగే అటు కేంద్రంలో కూడా బీజేపీ పాలన ప్రజాఆమోదంగా ఉండడంతోనో మోడీ సర్కార్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుందన్నారు.

అయితే జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. జీవన్ రెడ్డి ఒకపక్క కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే మరోపక్క బీజేపీ, బిఆర్ఎస్ ల పై ప్రశంసలు కురిపించడం వెనుక భవిష్యత్ లో బీజేపీ, బిఆర్ఎస్ ల రాజకీయ పొత్తు కనిపిస్తుందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మండిపడ్డారు.

బీజేపీ, బిఆర్ఎస్ లు రాజకీయంగా రెండు పార్టీలుగా ఉన్నప్పటికీ వాటి రాజకీయం మాత్రం ఒక్కటిగానే సాగుతుందని, ఇందుకు త్వరలో బిఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలే ప్రత్యక్ష నిదర్శనం అంటూ మాజీ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పై తీవ్ర అసహనాన్ని వ్యక్తపరిచారు మహేష్ గౌడ్.

అయితే త్వరలో బిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోబోతున్న జీవన్ రెడ్డి తానూ చేరబోయే పార్టీ మీద ప్రశంసలు కురిపించడం ఇక్కడ సమస్య కాదు కానీ తన రాజకీయ ప్రయాణానికి ఎటువంటి సంబంధం లేని బీజేపీ ని కూడా ఈ ప్రశంసలలో భాగం చెయ్యడమే ఇక్కడ చర్చ.

జీవన్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ తో పాటుగా కేంద్ర కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత ఏర్పడిందా.? అందులో భాగంగానే రాష్ట్ర నాయత్వం మీదున్న ఆవేశం బిఆర్ఎస్ ని దగ్గర చేస్తే అధిష్టానం మీదున్న అక్కసు బీజేపీ పై పొగడ్తలు కురిపించేలా చేసిందా.?

లేదా భవిష్యత్ లో ఈ రెండు పార్టీల రాజకీయ కలయిక తప్పనిసరే అని ఉహించి తన అనుచరగణానికి ముందుగానే సంకేతాలు పంపించే ప్రయత్నంలో భాగంగానే జీవన్ రెడ్డి బిఆర్ఎస్ తో పాటుగా బీజేపీ పై కూడా సానుకూల ప్రకటనలు చేసారా.?

 

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

హత్యలకు కూడా ఏఐ !!!

ఏఐ.. ఏం చేయగలదు? ఇది తప్పు ప్రశ్న. ఏఐ.. ఏం చేయలేదు? అనేది సరైన ప్రశ్న. సామాన్య ప్రజలు మొదలు…

9 minutes ago

ఈ రాజకీయ బొద్దింకలకు మోడీ, అమిత్ షాల వద్ద మందుందా?

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ళుగా అధికారంలో కొనసాగుతోంది. మరో మూడేళ్ళు ఎలాగూ ఉంటుంది. అంటే కాంగ్రెస్‌…

28 minutes ago