సినిమాల్లో దేవుళ్లపై రితేష్ రానా సెటైర్

Scene from Jet Lee movie showing satire on god trend with comedic actors reacting to divine appearance in sky

ఈమధ్యకాలంలో ఆల్మోస్ట్ అన్నీ బిగ్ బడ్జెట్ సినిమాల్లోనూ ఏదో ఒకరకంగా ఎవరో ఒక దేవుడ్ని కథ-కథనం బ్యాక్ డ్రాప్ లో వాడేస్తున్నారు. కార్తికేయ సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ “కార్తికేయ 2”తో ఊపందుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో ఏదో ఒక షాట్ లో ఏదో ఒక దేవుడి అంశని చూపి సెంటిమెంట్ ను క్యాస్ట్ చేసుకుంటున్నారు మేకర్స్.

ఈ ట్రెండ్ పై కాస్త గట్టి పంచ్ వేశాడు రితేష్ రానా. ఇవాళ విడుదలైన “జెట్ లీ” సినిమాలో ఒక సీన్ లో కమెడియన్ హర్ష “నాకు దేవుడు కనిపించాడు” అంటాడు.. దానికి సత్య క్లైమాక్స్ కదా అని సమాధానం ఇస్తాడు. అంతకుముందు ఆకాశంలో మబ్బుల్లో ఆంజనేయుడి రూపం కనిపిస్తుంది.

ADVERTISEMENT

ఈ సీన్, పంచ్ తో ప్రస్తుతం సినిమాల్లో దేవుళ్లు కనిపించే ట్రెండ్ పై పెద్ద సెటైర్ వేశాడు దర్శకుడు రితేష్ రానా. దీన్ని ఎంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు? ఎంతమంది హర్ట్ అవుతారు అనేది ప్రస్తుతానికి అంచనా వేయలేం కానీ.. చాలామంది ఫిలిం మేకర్స్ పై పడిన గట్టి పంచ్ ఇది. ఈ విషయంలో రితేష్ రానాకు ఫోన్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ADVERTISEMENT
Latest Stories