
Jogi Ramesh, Duvvada Srinivas Family Disputes
రాజకీయాలలోకి వ్యక్తిగత విషయాలు, కుటుంబ వివాదాలు లాగితే దాని తాలూకా బాధ, ఆవేదన ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఒక్కో వైసీపీ నేతకు అనుభవపూర్వకంగా తెలిసొస్తుందనే చెప్పాలి. నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అవే వ్యక్తిగత వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పవన్ పొలిటికల్ ఎంట్రీ తో ఆయన వ్యక్తిగత జీవితం, మూడు పెళ్లిళ్లు – విడాకుల అంశం ప్రత్యర్థి పార్టీల నేతలకు ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయింది. అయితే ఆ అస్త్రమే నేడు వైసీపీ నేతల పాలిట శాపంగా మారిందా అన్నట్టుగా నాడు పవన్ పై అటువంటి ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు అదే తరహా కుటుంబ వివాదాలను ఎదుర్కొంటు చివరికి న్యాయపోరాటాల వరకు వెళ్లాల్సి వచ్చింది.
పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్ కార్ స్టేఫినీలను మార్చినట్టుగా మూడేళ్లకొకసారి పెళ్లాలను మారుస్తాడు, పవన్ ముగ్గురు మహిళల జీవితం నాశనం చేసాడు అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదలు ఆ పార్టీ లోని నేతలంతా పవన్ మూడు పెళ్లిళ్ల టాపిక్ ని, విడాకుల వివాదాన్ని నిత్యం రాజకీయ తెరమీద చర్చలో ఉంచేవారు.
కానీ కట్ చేస్తే నాడు పవన్ మూడు పెళ్లిళ్లతో తన ఫాన్స్ కి ఏం సందేశం ఇస్తున్నాడు, అసలు హిందూ సంప్రదాయంలో ఇలా విడాకులు తీసుకుని మళ్ళీ మళ్ళీ పెళ్లిలు చేసుకునే ఆనవాయితీ ఎక్కడుంది అంటూ రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ చివరికి అదే వివాహ బంధానికి మాధురి తో సహజీవనం అంటూ శుభం కార్డు వేశారు. ఆరు పదుల వయస్సులో భార్య, పిల్లలను రోడ్డుకు లాగి దువ్వాడ – మాధురి మీడియాలో చేసిన రచ్చ నభూతోనభవిష్యతి అనే చెప్పాలి.
ఇక పవన్ ఒక పిచ్చి కుక్క. పవన్ కి మహిళల పట్ల ఏమాత్రం సంస్కారం లేదు అంటూ నాడు పవన్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ వేదికలెక్కించిన జోగి ఇప్పుడు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్న చందంగా కొడుకు – కోడలు ఇంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇక జోగి రమేష్ కోడలు మేఘన జోగి రమేష్ భార్య శకుంతల మీద జోగి తనయుడు రాజీవ్ మీద ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తూ మీడియాతో తన ఆవేదన పంచుకుంటున్నారు. తాజాగా మేఘన జోగి కుటుంబానికి సంబందించిన మరికొన్ని సంచలనమైన విషయాలను బయటపెట్టారు.
జోగి రమేష్ భార్య శకుంతల అదనపు కట్నం కోసం తనను వేధించారని, పెళ్లైన నెలకే ఆషాడం రావడంతో పుట్టింటికి వెళ్లిన తన పై ఈ అదనపు కట్నం వేధింపుల భారం మొదలుపెట్టారని, పుట్టింటింటి నుండి కట్నం తెస్తేనే రాజీవ్ కి తన పై ఫీలింగ్స్ వస్తాయని శకుంతల తన ఫై ఒత్తిడి చేసారంటూ వాపోయారు మేఘన.
అలాగే సమస్య పరిష్కారం కోసం తానూ, తన కుటుంబం వైసీపీ నేత సజ్జలను, టీడీపీ నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ ను కలిశామని, జగన్ ను కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదంటూ ఈ వివాదంలో టీడీపీ నేతల పాత్ర అంటూ జోగి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మేఘన.
అదనపు కట్నం వేధింపులతో పాటుగా తన పై జోగి కుటుంబం మత మార్పిడి కొరకు కూడా ఒత్తిడి చేసారంటూ ఆరోపించారు. మేము హిందువులం అంటూ వివాహం చేసిన జోగి కుటుంబం క్రిస్టియన్లు అని, చివరికి జోగి కుటుంబం తనను కూడా క్రిస్టియన్ మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చారంటూ మరో తీవ్రమైన ఆరోపణ చేసారు.
ఇలా తెలుగు సీరియల్ మాదిరి నిత్యం మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న జోగి బతుకు జట్కా బండి కథను నా వ్యక్తిగత సమస్యని, మా కుటుంబ వివాదమని వాటిని రాజకీయంలోకి ఎందుకు తెస్తున్నారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులు నాడు పవన్ పెళ్లిళ్లు, విడాకులు అనేవి కూడా పవన్ వ్యక్తిగత సమస్యలు అని గ్రహించలేకపోయారా.? లేదా అవి ఆయన కుటుంబ వివాదాల కిందకి రావని భావించారా.?
ఇటువంటి విషయాలలో గోప్యత అవసరం అంటూ ఇప్పుడు గుండెలు బాదుకుంటున్న వైసీపీ నేతలు మరి నాడు అటువంటి సమస్యలనే రాజకీయ విమర్శలుగా చేసుకుని ఇతరుల కుటుంబాలలో నిఘా నేత్రం మా రాజకీయ హక్కు అంటూ నినదించడం ఏమాత్రం సమంజసం.?
సమస్య తన దాకా వస్తే కానీ ఈ సోకాల్డ్ వైసీపీ నేతలకు నొప్పి తెలియలేదా.? అయితే నాడు పవన్ మూడు పెళ్లిళ్లు – విడాకుల వంటి అంశాలలో మేము పవన్ బాధితులమని ఏ ఒక్క మహిళా కూడా మీడియా ముందుకు రాలేదు, తమకు అన్యాయం జరిగిందంటూ న్యాయస్థానాలను ఆశ్రయించలేదు.
కానీ ఇక్కడ దువ్వాడ శ్రీనివాసరావు భార్య, పిల్లలు మాధురి – దువ్వాడ సహజీవనం తమకు తమ కుటుంబానికి ఆర్థిక, మానసిక నష్టాన్ని కలిగిస్తుందంటూ మీడియా ముందుకొచ్చారు, దువ్వాడ, మాధురి కేంద్రంగా అనేక విమర్శలు, ఆరోపణలు చేసారు.
అలాగే ఇటు జోగి రమేష్ విషయంలో కూడా జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ సతీమణి మేఘన జోగి కుటుంబం తనపై గృహహింసకు పాల్పడిందంటూ, వారి కుటుంబం వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ న్యాయపోరాటానికి దిగింది.
కానీ పవన్ విషయంలో ఇటువంటి సమస్యలేమీ లేనప్పట్టికి వైసీపీ నేతలు పదేపదే పవన్ మూడు పెళ్లిళ్ల అంశాన్ని తెరమీద్దకు తెచ్చి, రాజకీయాలకు సంబంధం లేని మహిళలను రాజకీయ వేదికలెక్కించి రాజకీయాలకు – వ్యక్తిగత జీవితానికి మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేసారు.
దాని తాలూకా ఫలితాలను నేడు వారి కుటుంబాలు కూడా అనుభవించాల్సి రావడం యాదృచ్ఛికమో.? లేదా దేవుని స్క్రిప్ట్ ఇలా రాసిపెట్టిందో కానీ మొత్తానికి నాడు పవన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన నేతలంతా కూడా ఇప్పుడు అదే వ్యక్తిగత సమస్యలతో నవ్వులపాలవుతున్నారు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…