Telugu

‘ఫ్యాక్ట్’ రిపోర్ట్… వైసీపీ చూపులు పవన్ వైపే..!

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు జరిగిన న్యాయంపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న విభిన్న ప్రకటనల నేపధ్యంలో… అసలు వాస్తవం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో… ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ పేరుతో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం నాడు ఈ నివేదికను పవన్ కళ్యాణ్ కు అందజేయగా, ఇంతకీ ఈ రిపోర్ట్ లో ఏముంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT

‘ఫ్యాక్ట్ ఫైండింగ్’ కాబట్టి సహజంగానే కేంద్ర ప్రభుత్వమైన బిజెపి ఏపీకి చేసిన ద్రోహం ఖచ్చితంగా ఉందనేది లభించిన కీలక సమాచారం. అలాగే అవినీతి విషయంలో టిడిపి ప్రభుత్వంలో ఉన్న బొక్కలను కూడా ఈ కమిటీ ఎత్తిచూపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టిడిపి – బిజెపిల వలన రాష్ట్రానికి పెద్దగా చేకూరిన ప్రయోజనం ఏమీ లేదని కమిటీ తన నివేదికగా పవన్ ముందుంచినట్లు తెలుస్తోంది.

‘ప్రత్యేక హోదా’ స్థానంలో ‘ప్రత్యేక ప్యాకేజ్’ను ఇస్తామని ఏపీ ప్రజలను మోసం చేసిన తీరు ఈ నివేదికలో ప్రధాన హైలైట్ గా నిలవనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ శనివారం నాడు అధికారికంగా వెల్లడించనున్నారు. అయితే దీనిని ఎలా ప్రజలకు తెలియజేయాలి? అనే దానిపై కమిటీ సభ్యులతో కలిసి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ చెప్పే విధానంతోనే పవన్ భవిష్యత్తు రాజకీయాలు ముడిపడనున్నాయి. అందుకే వైసీపీ కూడా ఈ ప్రకటన కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Watch: Toxic FAILED, But #Yash DID NOT!

 From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…

4 hours ago

Toxic Washout Overseas: Fairy Tale Turns into Scary Tale?

Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…

9 hours ago