Telugu

‘సీనియర్’ పుట్టినరోజును ముందుగానే జరిపిన ‘జూనియర్!’

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ప్రత్యక్షమయ్యాడు. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘జనతా గ్యారేజ్’లో నటిస్తున్న జూనియర్… ఆ చిత్రం షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ఓ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ 27వ తేదీ నుండి చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందు నిమిత్తం ఇప్పటికే చెన్నై పయనమైంది చిత్ర బృందం.

ADVERTISEMENT

అయితే తాత, స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి అయిన ఈ నెల 28న ఎన్టీఆర్ ఘాట్ కు రావడం జూనియర్ ఎన్టీఆర్ కు అలవాటు. అయితే ఈ సారి తాను అందుబాటులో ఉండకపోవడంతో ముందుగానే జూనియర్ ఎన్టీఆర్ తన తాతకు నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చాడు. తాతకు ఘనంగా నివాళి అర్పించిన తర్వాత ఇంటికెళ్ళిన జూనియర్ చెన్నై పయనమయ్యారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త ఏమిటంటే… తాత పుట్టినరోజును పురస్కరించుకుని తొలి టీజర్ ను విడుదల చేయాలని భావించినప్పటికీ, కుదరకపోవడంతో జూన్ ఫస్ట్ వీక్ ‘ఈద్’ పండుగకు తొలి టీజర్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ‘జనతా గ్యారేజ్’ టీం నుండి ఒక పోస్టర్ అయితే రాబోతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Srijita Turns Mirror Poses Into Pure Glam

Srijita Ghosh turns a rain-kissed glass setting into a striking fashion frame, pairing delicate white…

6 minutes ago

Trivikram’s AK47 Oct 9: Holiday Jackpot or Too Crowded?

Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam has officially moved from October 2 to October 9. The…

37 minutes ago