
జూ.ఎన్టీఆర్ చాలా ఏళ్ళుగా రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తన అవసరమున్నా వచ్చి పనిచేస్తానని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత ఏనాడూ రాజకీయాలు మాట్లాడింది లేదు. కనీసం తన సినిమాలలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఎటువంటి అంశాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. టీడీపి కూడా వైసీపీతో పట్లు పడుతోందే తప్ప ఏనాడూ జూ.ఎన్టీఆర్ ఊసు ఎత్తలేదు.
అనంతపురం అర్బన్ టీడీపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ పరిస్థితిని ఒక్కసారిగా తారుమారు చేశారు. జూ.ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూ.ఎన్టీఆర్ అభిమానులు మీడియాతో మాట్లాడుతూ, “జూ.ఎన్టీఆర్ స్వయంకృషితో సినీ పరిశ్రమలో పైకి వచ్చారు. ఆయన, మేము కూడా టీడీపిలోనే ఉన్నాము. అటువంటప్పుడు టీడీపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూ.ఎన్టీఆర్ గురించి ఆవిధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?ఆయన ఉద్దేశ్యం ఏమిటి?
జూ.ఎన్టీఆర్‌ని మాత్రమే కాదు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఆవిధంగా ఎందుకు మాట్లాడారు?నోటికి వచ్చినట్లు మాట్లాడేసి, బెడ్ రూమ్‌లో కూర్చొని ఓ వీడియో మెసేజ్ పెట్టేస్తే సరిపోతుందా?
ఆడవాళ్ళకు టీడీపి ఎంతో గౌరవం ఇస్తుంది. కానీ ఆడవాళ్ళ పట్ల ఇంత అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌ని పార్టీలో కొనసాగనిస్తే పార్టీకి అప్రదిష్ట. మన ప్రత్యర్ధులు కూడా వేలెత్తి చూపి విమర్శించే అవకాశం ఇచ్చినట్లవుతుంది.
ఇంతవరకు అయనని బేషరతుగా క్షమాపణ చెప్పమని మాత్రమే అడిగాము. కానీ అందుకు ఆయన అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము సిఎం చంద్రబాబు నాయుడుగారికి విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు.
నిజానికి ఎమ్మెల్యే స్వయంగా జూ.ఎన్టీఆర్ అభిమానులకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ సమస్యని పరిష్కరించుకొని ఉండవచ్చు. కానీ ఈ పంచాయితీని సిఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళేలా చేశారు. కనుక నేడో రేపో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివరణ తీసుకొని సిఎం చంద్రబాబు నాయుడు తగిన నిర్ణయం తీసుకోకమానరు.
అయితే ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ పేరుతో టీడీపిలో, ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టడం, వారి పేర్లు, పోస్టర్లు, సినిమాలతో వైసీపీకి రాజకీయాలు చేయడం బాగా అలవాటు. కనుక జూ.ఎన్టీఆర్ అభిమానుల వెనుక కూడా వైసీపీ హస్తం ఉందో లేదో నిర్ధారించుకోవడం కూడా చాలా అవసరమే.
ఏది ఏమైనప్పటికీ, ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించకపోతే ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న వైసీపీకి చేజేతులా అవకాశం కల్పించినట్లవుతుంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…