Telugu

ఎన్టీఆర్ ని తెస్తే నష్టం ఏ పార్టీ కి?

జూ.ఎన్టీఆర్‌ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకొంటున్నాడు. అయినా ఏపీ రాజకీయాలలోకి బలవంతంగా ఆయనను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు. ఒకవేళ టిడిపికి చెందినవారు ఆయనను ఆహ్వానిస్తుంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండటమే ఆలోచించవలసిన విషయం.

గతంలో ఓసారి టిడిపికి జూ.ఎన్టీఆర్‌ని దూరం చేసేందుకు సీనియర్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫోటోలతో కృష్ణాజిల్లాలో వైసీపీ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టింది. వాటిని చూసినవారికి జూ.ఎన్టీఆర్‌ వైసీపీలో చేరబోతున్నారా?అనే సందేహం కలిగేలా చేశారు. మళ్ళీ తాజాగా గుడివాడలో వైసీపీ యువదళం పేరుతో వెలిసిన ఫ్లెక్సీ బ్యానర్లలో కూడా సీనియర్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫోటోలు ముద్రించారు.

ADVERTISEMENT

ఒకవేళ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకి వారిపై అంతగా ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని ఖండిస్తూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి ఉంటే బాగుండేది. కానీ టిడిపిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో విదంగా ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం సృష్టించి చీలికలు తీసుకురావాలని వైసీపీ కుట్రలు చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది.

ఇందుకు మరో తాజా ఉదాహరణగా కొందరు టిడిపి పేరుతో జూ.ఎన్టీఆర్‌ అభిమానులకు వాట్స్ అప్‌ సందేశాలు పంపిస్తున్నారు. వాటి సారాంశం ఏమిటంటే, జూ.ఎన్టీఆర్‌ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్‌ ఇద్దరూ సమానమే అని ఎన్టీఆర్‌ను అవమానించినందుకు ఇకపై జూ.ఎన్టీఆర్‌ సినిమాలను బాయ్‌కాట్‌ చేయాలని!

టిడిపి పేరుతో వస్తున్న ఈ సందేశాలను చూసి అవి తమ పార్టీ నిర్ణయంగానే కార్యకర్తలు భావించవచ్చు. అప్పుడు వారు కూడా జూ.ఎన్టీఆర్‌ సినిమాలను బాయ్‌కాట్‌ చేయాలంటూ టిడిపిలో తమతోటి కార్యకర్తలకు ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుందో ఊహించవచ్చు. దీంతో టిడిపిలో గందరగోళం మొదలయ్యి కార్యకర్తలు జూ.ఎన్టీఆర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయే అవకాశం ఉంటుంది. టిడిపిని అంతర్గతంగా బలహీనపరిచేందుకు ఇటువంటి నీచమైన కుయుక్తులు, కుట్రలు పన్నుటూ బహిరంగసభలలో వేదికలపై ధర్మం, న్యాయం, దేవుడు అంటూ నీతులు వల్లించడం వైసీపీ నేతలకే చెల్లు.

చివరిగా ఒక విషయం… అసలు టిడిపికి, ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూ.ఎన్టీఆర్‌ పేరుతో రాజకీయాలు చేయడం ఎందుకు?నిద్రపోతున్న యంగ్ టైగర్‌ను రెచ్చగొట్టి ఏపీ రాజకీయాలలోకి తెచ్చుకొంటే నష్టపోయేది వైసీపీయే తప్ప టిడిపి కాదనే విషయం వైసీపీ నేతలు గ్రహించినట్లు లేదు.

తెలంగాణలో గంగిగోవు వంటి కాంగ్రెస్‌ను చంపేసి, పులివంటి బిజెపిని తెచ్చుకొని సిఎం కేసీఆర్‌ ఇప్పుడు దానితో తిప్పలు పడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిదంగా టిడిపిని దెబ్బతీయాలనే ప్రయత్నంలో యంగ్ టైగర్‌ను రెచ్చగొట్టి ఏపీ రాజకీయాలలోకి తెచ్చుకొంటే వైసీపీకి కూడా అదే జరుగుతుందని గ్రహిస్తే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

పుంగనూరులో అంత హడావుడి చేసి ఇప్పుడు తూచ్ అంటే ఎలా?

ఇటీవల పుంగనూరులో నామినేషన్స్‌ ప్రక్రియలో వైసీపీ ఎమ్మెల్సీ మిథున్ రెడ్డి ఎంత హడావుడి చేశారో, ఎంత విధ్వంసం జరిగిందో అందరూ…

3 minutes ago

KWK9: Rashmika Proposed 100 Times? Vijay Drops a Bomb!

Vijay Deverakonda and Rashmika Mandanna are currently promoting their latest film Ranabaali. The popular pair…

27 minutes ago