
బహుశా ఇలాంటి పుకార్లకు ఇక శుభం కార్డు వేయాలని భావించారో ఏమో గానీ, ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజతో ‘పవర్’ సినిమాను తెరకెక్కించి, టాలీవుడ్ కు పరిచయమైన బాబీ, ఆ తర్వాత ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ తో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను తీసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దర్శకుడికే ‘బుడ్డోడు’ ఓటు వేసారన్న విషయం దాదాపుగా ఖరారైంది.
మాస్ అంశాలను ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన బాబీ చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చిందని, అందుకే తన సోదరుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోనే ఈ సినిమాను నిర్మించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అతి త్వరలోనే వెల్లడి కానుందని తెలుస్తోంది. మొత్తానికి టాప్ దర్శకులతోనే చేయాలన్న నియమాలు పెట్టుకోకుండా కధలకు తగ్గట్టుగా జూనియర్ అడుగులు వేయడంతో, ఈ స్క్రిప్ట్ పైన కూడా యంగ్ టైగర్ అభిమానులు నమ్మకాలు పెట్టుకుంటున్నారు.
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…