త్రివిక్రమ్… కొరటాల… లైన్ లో ఉన్నారు..!

Jr NTR next Projects - Koratala Siva Trivikram Srinivasప్రస్తుతం బాబీ దర్శకత్వంలో “జై లవకుశ” సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు అభిమానుల కోసం సరికొత్త వార్తలు వెలువడనున్నాయి. అందులో ఒకటి ‘యంగ్ టైగర్’ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంభినేషన్. అతను మరెవరో కాదు… ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్..! అవును… త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించాలనే ఆకాంక్ష అభిమానుల్లో ఎప్పటి నుండో వ్యక్తమవుతోంది. అది ఇన్నాళ్ళకు నెరవేరబోతోందన్న మాట!

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా, 29వ సినిమా కూడా ఇప్పటికే ఖరారైంది. జూనియర్ ఎన్టీఆర్ కు ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలోనే మరో సినిమా రానుంది. దీనికి సంబంధించి కూడా ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో 2017వ సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అభిమానులకు మరింత స్పెషల్ గా మారింది. ఇప్పటికే ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పండగ చేసుకుంటుండగా, తాజాగా టాలీవుడ్ క్రేజీ దర్శకులు లైన్ లో ఉన్నారన్న సమాచారం మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ‘యంగ్ టైగర్’ అభిమానులకు పంచుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories