రాజకీయ ఎంట్రీ పై ఎన్టీఆర్ తాజా వ్యాఖ్యలు… నర్మగర్భమా లేక రంద్రాన్వేషణా?

Jr NTR Politicsయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో కు హోస్ట్ గా చెయ్యబోతున్నారు. జెమినీ లో ప్రసారమయ్యే ఈ షో కౌన్ బనేగా కరోడ్ పతి షో సరికొత్త సీజన్. ఈ షోకు సంబంధించిన టీజర్ ఈ రోజు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్ తరువాత మీడియా నుండి ప్రశ్నలను తీసుకున్నాడు. మీడియా సిబ్బందిలో ఒకరు స్టార్ పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగారు.

“నా సమాధానం మీకు తెలుసు. వివిధ ప్రెస్ మీట్లలో నేను చాలాసార్లు చెప్పాను” అని ఎన్టీఆర్ మొదట చెప్పారు. తన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని సదరు మీడియా వ్యక్తి సమాధానం కోసం పట్టుబట్టారు. “ఆ విషయాలు మాట్లాడానికి ఇది సమయమూ కాదు సందర్భమూ కాదు. మేము తరువాత కూర్చుని మాట్లాడదాం” అని ఆర్ఆర్ఆర్ స్టార్ తనదైన శైలిలో సరదాగా చెప్పుకొచ్చాడు.

ADVERTISEMENT

అయితే దీనిపై ఎవరికి నచ్చిన విధంగా వారు విశ్లేషణలు చేసుకుంటున్నారు. సహజంగా రాజకీయాల విషయంలో ఎన్టీఆర్ కుండబద్దలు కొట్టేస్తారు. తరువాత మాట్లాడదాం అంటే ఏదో ఉంది అని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే నా సమాధానం ఏంటో మీకు ముందే తెలుసు అని ఎన్టీఆర్ తన మనసులో మాట చెప్పకనే చెప్పేశాడు.

సరదాగా తరువాత మాట్లాడదాం అన్న మాటను భూతద్దంలో చూస్తుండవచ్చు. ఏది ఏమైనా సినిమాలలో చాలా భవిష్యత్తు ఉన్న ఎన్టీఆర్, చిన్న వయసులో అన్నీ వదిలేసి రాజకీయాలలోకి వస్తాడా అనేది అనుమానమే. అయితే ఎప్పటికైనా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories