
ఈడ లేదు ., ఆడ లేదు.. యాడైన నేనే అన్నట్లుగా సాగిపోతున్నాయి “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుడికి ఉండే క్రేజ్ వేరే లెవల్.., దానికి తోడు ఇటు ‘మెగా’., అటు ‘నందమూరి’ బ్రాండ్స్… ఇక థియేటర్లలో రచ్చ మాములుగా ఉండదంటున్నారు సినీ అభిమానులు.
సహజంగానే అగ్ర హీరో సినిమా అంటే వారి అభిమానులు థియేటర్లలో చేసే కోలాహలం అంత ఇంత కాదు.., అలాంటిది ఇద్దరు సూపర్ స్టార్స్ కలసి ఒకే తెరపై కనువిందు చేస్తే ఆ సునామీకి అడ్డుకట్ట వేయడం సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే ప్రమోషన్స్ లో తన అల్లరితో ఎన్టీఆర్., పెద్దరికంతో జక్కన్న., సింప్లిసిటీతో రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
తమ ప్రమోషన్స్ తో సినిమాపై క్రేజ్ ఆకాశానికి చేర్చారు జక్కన్న., అతని హీరోలు. అలాగే సినిమా టికెట్ రేట్లు కూడా అంతే ఎత్తుకు ఎదిగాయనేది కూడా వాస్తవం. క్రేజ్ ను కాష్ చేసుకోవడంలో జక్కన్నను దాటలేరు ఏ దర్శకుడు. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే తెరపై చూడాలంటే ఆ మాత్రం ఖర్చవుతది మరి. సినిమాకు గాన పాజిటివ్ టాక్ వస్తే ఇక ఆ లెవల్ వేరు అంటున్నారు ఇరు హీరోల అభిమానులు.
“ఆర్ఆర్ఆర్”తో ఎంజాయ్ మెంట్ అంటే మాములుగా ఉండదు మరి అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ప్రేక్షకుడి అంచనాలు అందుకొని ఇద్దరి మెగా., నందమూరి అభిమానుల మనసుని గెలుచుకుంటుందేమో అని. అంచనాలు అందుకుంటే మాత్రం టికెట్స్ రేట్లు కూడా ఇప్పట్లో సామాన్యుడికి అందవనేది యదార్ధం.
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…