‘జనతా గ్యారేజ్’ సెట్ కు అనుకోని ‘అతిథి’

Jr NTR son Abhay first visit to janatha garageఅవును… కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా షూటింగ్ కు ఓ అనుకోని అతిథి విచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, చిత్ర యూనిట్ సభ్యులను సర్ ప్రైజ్ చేసాడు. వచ్చిన అతిధితో యూనిట్ సభ్యులంతా కాసేపు ఆడుకున్నారు కూడా. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ADVERTISEMENT

ఇంతకీ… ఆ అతిథి మరెవరో కాదు… జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్. జూనియర్ సతీమణి ప్రనిత మరియు అభయ్ లు కలిసి కాసేపు ‘జనతా గ్యారేజ్’ సెట్లో సందడి చేసారు. మొదటి సారి తన ముద్దుల ‘గారాలపట్టి’ సినిమా షూటింగ్ కు రావడంతో జూనియర్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. షూటింగ్ విశేషాలు ఇలా ఉంటే, ఈ నెల 20వ తేదీన జూనియర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

అలాగే జూలై 15వ తేదీన ఆడియో, ఆగష్టు 12వ తేదీన సినిమా విడుదల కానుందని యూనిట్ వర్గాల సమాచారం. ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో భారీ స్థాయిలో ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ‘శ్రీమంతుడు’ నిర్మాతలైన ‘మైత్రీ మూవీస్ ప్రొడక్షన్స్’ సంస్థే ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories