
వెండితెర మీద ఎంత బాగా అభినయించగల సత్తా ఉందో, వెండితెర వెనుక తన గాత్రంతో మైమరిపించగల సామర్ధ్యం ఉందని, ఈ ఏడాది విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఆలపించిన గానంతో చాటిచెప్పాడు. అదే స్వరాన్ని ‘బాహుబలి 2’ కోసం రాజమౌళి వాడుకుంటున్నారన్నది లేటెస్ట్ న్యూస్. ‘బాహుబలి 2’లో జూనియర్ ఎన్టీఆర్ చేత ఒక పాట పాడించబోతున్నారని హల్చల్ చేస్తున్న వార్తల్లో నిజం ఎంతుందో గానీ, సినీ వర్గాల్లో ఈ పుకారు 100 మైళ్ళ వేగంతో షికారు చేస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సినిమాలో కూడా ఓ పాట పాడటంతో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చినట్లు అవుతోంది. అలాగే రాజమౌళికి, జూనియర్ కు కూడా చక్కని సాన్నిహిత్యం ఉండడం మరింత అదనం. మరి దీనిపై ఎవరు స్పష్టత ఇస్తారో గానీ, అప్పటివరకు జూనియర్, యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు ఉత్కంఠ తప్పదు.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…