మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారిగా నటిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ “అరవింద సమేత” సినిమాపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కమర్షియల్ గా ఆ అంచనాలను రీచ్ అయ్యేలా ఫస్ట్ టీజర్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ చేయడంతో, యూ ట్యూబ్ లో ఈ టీజర్ క్లిక్స్ మోత మోగించింది.
తొలి గంటలోనే 1.5 మిలియన్ క్లిక్స్ అందుకున్న ఈ టీజర్, 12 గంటలు చేరుకునే సమయానికి 5 మిలియన్ క్లిక్స్ కు చేరుకోవడం విశేషం. దీంతో ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, యంగ్ టైగర్ అభిమానులు ఎంతగా నిరీక్షిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మొదటి 100కే లైక్స్ ను మొదటి అరగంటలోనే అందుకున్న ఈ టీజర్ దాదాపుగా 300 కే లైక్స్ కు చేరువ అయ్యింది.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



