సురేఖగారూ… ఇది చాలా ఓవర్ కదా?

నాగ చైతన్య, సమంత దంపతులు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆఆరే కారణమని, ఆయన సినీ పరిశ్రమలో పలువురు హీరోయిన్లకి మాదక ద్రవ్యాలు అలవాటు చేశారని, ఆయన వేధింపులు భరించలేక పలువురు సినీ హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా సినీ ప్రముఖులు ఇటువంటి వ్యాఖ్యలపై కూడా తొందరపడి స్పందించరు. స్పందిస్తే అది అక్కడితో ఆగదని వారికీ తెలుసు. కానీ తొలిసారిగా నాగ చైతన్య, సమంత, జూ.ఎన్టీఆర్‌, నాని తదితరులు చాలా ఘాటుగా స్పందించారు.

ADVERTISEMENT

ముందుగా నాగ చైతన్య స్పందిస్తూ “జీవితంలో విడాకులు అత్యంత భాధాకరమైన, కటినమైన నిర్ణయం. ఈ విషయంలో మేమిద్దరం చాలా ఆలోచించిన తర్వాతే పరస్పరం అంగీకారంతో విడిపోయాము. ఆ తర్వాత మా విడాకులపై అనేక నిరాధారమైన ఆరోపణలు వచ్చాయి.

కానీ ఇరు కుటుంబాలపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దం హాస్యాస్పదంగా ఉన్నాయి. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు,” అని అన్నారు.

సమంత స్పందిస్తూ, “విడాకులు నా వ్యక్తిగత విషయం . దాని గురించి ఊహాగానాలు మానుకోవాలని అభ్యర్ధిస్తున్నా. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలి. ఈ ప్రయాణంతో నేను చాలా నేర్చుకున్నాను. అందుకు గర్వపడుతున్నా.

ఇతరులపట్ల ఇటువంటి మాటలు సరికాదు. మంత్రిగా మీ మాటలకు ఓ విలువ ఉంటుంద గ్రహించి, ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని కోరుతున్నాను.

నా విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయి. దీనిలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. దయచేసి నా పేరుని రాజకీయాలలోకి లాగొద్దు. నేను వాటికి ఎప్పుడూ దూరంగానే ఉంటాను,” అని అన్నారు.

జూ.ఎన్టీఆర్‌ స్పందిస్తూ, “కొండా సురేఖగారు ఇతరుల వ్యక్తిగత జీవితాలతో నీచ రాజకీయాలు చేయడం సరికాదు. ప్రజా జీవితంలో ఉన్న మీవంటివారు మరింత హుందాగా, గౌరవంగా వ్యవహరించాలి. సినీ పరిశ్రమలో ఉన్నవారి గురించి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం.

ఎవరైనా మాపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తుంటే మేము చేతులు ముడుచుకొని మౌనంగా చూస్తూ కూర్చోము. ఇటువంటి వాటికంటే మనం ఉన్నతంగా వ్యవహరిస్తూ ఎవరి సరిహద్దులో వారు ఉండాలి. మన ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి నిర్లక్ష్య ధోరణిని సమాజం ఉపేక్షించదు.

సహజ నటుడు నాని స్పందిస్తూ, “రాజకీయ నాయకులు దేని గురించి ఏదైనా మాట్లాడేయవచ్చనే మీ ధోరణి చాలా దిగజారుడుతనాన్ని సూచిస్తోంది. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఇంత మూర్ఖంగా మాట్లాడిన మాటలు విన్నప్పుడు మీరు ప్రజల పట్ల బాధ్యతగా ఉంటారని ఆశించలేము.

ఇది కేవలం సినీ నటులో లేదా రాజకీయపార్టీల గురించి మాత్రమే కాదు. గౌరవ ప్రదమైన హోదాలో ఉంటూ ఈవిదంగా ఎవరు మాట్లాడినా తప్పే. మనం మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా చెల్లుతుందనుకోవడం తప్పే. సమాజంపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి ధోరణిని అందరూ ఖండించాలి,” అని ట్వీట్‌ చేశారు

ప్రకాష్ రాజ్‌ స్పందిస్తూ,”ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? #జస్ట్ ఆస్కింగ్,” అని ట్వీట్‌ చేశారు.

మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “ఫోన్‌ ట్యాపింగ్, ఇతర అంశాల గురించి కొండా సురేఖగారు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నా. వాటితో నాకు ఎటువంటి సంబందమూ లేదు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఆమె నోటికి వచ్చిన్నట్లు అబద్దాలు చెప్పారు. నేను వాటిని ఖండించకపోతే ఆమె ఆరోపణలు నిజమని ప్రజలు భావించవచ్చు. అందుకే స్పందిస్తున్నాను

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

విశాఖ మేయర్ పీఠం.. ఆ జనరల్ మహిళ ఎవరు?

విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ…

37 minutes ago

After A Big Break, Vallabhaneni Vamsi Is Back?

Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…

1 hour ago