జూనియర్ ఎన్టీఆర్ మాటున నలిగిపోతున్నాడు!

Jr NTR VS Manchu Manoj Okkadu Migiladuసోషల్ మీడియా అంతా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన “జై లవకుశ” ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించే చర్చ నడుస్తోంది. పవర్ ఫుల్ గెటప్ లో బుడ్డోడు రూపం అభిమానులకు విపరీతంగా నచ్చడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున మరో టాలీవుడ్ హీరో పుట్టినరోజు కూడా ఉంది. సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత వయసు ఉందో, ఆ హీరోకు కూడా అంతే వయసు.

1983, మే 20వ తేదీన పుట్టిన జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ లలో, తారక్ సినీ వినీలాకాశంలో పతాక స్థాయికి చేరుకోగా, మంచు మనోజ్ మాత్రం ఇంకా ప్రయత్నాలలోనే ఉన్నాడు. దీంతో క్రేజ్ రీత్యా పీక్ స్టేజ్ లో ఉన్న తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించే మాట్లాడుకోవడంతో, మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం “ఒక్కడు మిగిలాడు” బర్త్ డే పోస్టర్ మరుగున పడిపోయినట్లయ్యింది.

ADVERTISEMENT

తారక్ ఎలాగైతే కెరీర్ లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడో, మంచు మనోజ్ కూడా ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. 1990లో టైగర్ గా ఉన్న లుక్ ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా 2017లో ఓ సాధారణ వ్యక్తిగా ఉన్న లుక్ ను రిలీజ్ చేసారు. ‘ఎన్ అన్ టోల్డ్ ట్రూ స్టోరీ’ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ బాగానే ఉన్నప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ”పై ఉన్న బజ్ రీత్యా, ‘ఒక్కడు మిగిలాడు’ని పట్టించుకునే ప్రేక్షకుడు లేకపాయే!

ADVERTISEMENT
Latest Stories