“నాన్నకు ప్రేమతో” సినిమాలో “1 నేనొక్కడినే” సెంటిమెంట్!

JrTR Nannaku-Prematho-Movie-reviewఫెయిల్యూర్స్ “ప్రతిభ”కు కొలమానం కావని, సెంటిమెంట్లు “సక్సెస్”ను తెచ్చిపెట్టలేవని దర్శకుడు సుకుమార్ నిరూపిస్తున్నారు. సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన సినిమాలోని సెంటిమెంట్లను తదుపరి చిత్రాలలో ఫాలో అవరు. అలా అయితే సుకుమార్ స్పెషాలిటీ ఏముందనుకున్నారో గానీ, “1 నేనొక్కడినే” సినిమాలో ఫెయిల్ అయిన సెంటిమెంట్ నే “నాన్నకు ప్రేమతో” సినిమాలో కూడా అనుసరించాడు సుక్కు.

ప్రిన్స్ మహేష్ బాబు తో తెరకెక్కించిన “1 నేనొక్కడినే” సినిమాలో మహేష్ పాత్ర పేరు బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది. రియల్ లైఫ్ లో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణలోని పేరును షార్ట్ కట్ చేసి, మొదటి పదం గౌతమ్ ను పేరును ప్రిన్స్ పాత్రకు పెట్టి అభిమానులకు షాకిచ్చాడు ఈ క్రియేటివ్ దర్శకుడు.

ADVERTISEMENT

తాజాగా “నాన్నకు ప్రేమతో” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తనయుడు పేరు ‘అభయ్ రామ్’ పేరును షార్ట్ కట్ చేసి ‘అభిరామ్’గా జూనియర్ పాత్రకు పెట్టాడు. ‘సెంటిమెంట్’ ఒకటే అయినా ‘రిజల్ట్’ మాత్రం తేడా అంటున్నారు జూనియర్ అభిమానులు. ప్రస్తుతం ధియేటర్ల వద్ద ‘బుడ్డోడు’ అభిమానులు సృష్టిస్తున్న హంగామాకు కొదవలేదు.

ADVERTISEMENT
Latest Stories