రాజకీయ నేతల మీద సినీ సెలబ్రెటీల మీద సోషల్ మీడియాలో రూమర్స్ కు హద్దు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రేటిస్ వివాహ బంధానికి సంబందించిన విషయంలో ఇటువంటి గాసిప్స్ కు అంతే ఉండదు.
తాజాగా తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించిన స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా లో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
దీనిపై తమ అభిమానులకు క్లారిఫికేషన్ ఇచ్చారు నటి, సూర్య భార్య జ్యోతిక. పిల్ల చదువుల కోసం, తాను నటించబోయే బాలీవుడ్ ప్రోజెక్టుల కోసం ముంబైలో ఉండాల్సి వస్తుందని, పిల్లల చదువులు పూర్తి కాగానే తిరిగి చెన్నై వెళ్ళిపోతాం అంటూ క్లారిఫికేషన్ ఇచ్చారు జ్యోతిక. సూర్య చాల మంచి వ్యక్తి అంటూ భర్త పై ప్రశంసలు కురిపించి “మేము విడిపోలేదు మీరు విడకొట్టొద్దు” అంటూ ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
అలాగే సూర్య తో పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక తాజాగా తిరిగి సినీ రంగానికి దగ్గరవుతూ తన కెరీర్ ను కొనసాగించడంతో ఇటువంటి ప్రచారాలకు బలం చేకూరి ఉండవచ్చు అంటూ కొందరు జ్యోతిక కు మద్దతుగా నిలబడితే, నిప్పు లేనిదే పొగ రాదు…, విడాకులు తీసుకునే ముందు అందరు ఇలానే కవర్ చేస్తుంటారు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో జ్యోతిక క్లారిఫికేషన్ మీద కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ సినిమా ప్రమోషన్ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కూడా రజని క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘అర్దమయ్యిందా రాజా’ అంటూ మూవీ ఈవెంట్ లో మాట్లాడిన రజని మాటలు మరో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ను ఉద్దేశించి అంటూ రూమర్స్ ప్రచారం అయిన నేపథ్యంలో రజని స్పందించారు.
దళపతి విజయ్ ను ఉద్దేశించి నేను ఆ వ్యాఖ్యలు చేయలేదని, విజయ్ తన కళ్ల ముందే పెరిగాడని, తనకున్న టాలెంట్, పట్టుదలతో సినీ ఇండస్ట్రీ లో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారని మా మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్. నాకు ఎవరితోనూ పోటీ లేదని తనకు తానే పోటీ అంటూ ఇద్దరినీ పోల్చి చూడొద్దని తన అభిమానులను ఉద్దేశించి లాల్ సలాం మూవీ ప్రమోషన్ లో క్లారిఫికేషన్ ఇచ్చారు రజనీకాంత్.
ఈ మూవీ కి రజని కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు, అలాగే ఈ మూవీ లో రజనీకాంత్ ఒక ప్రత్యేక పాత్ర లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో నే రజనీకాంత్ తన పై వచ్చిన రూమర్స్ కు చెక్ పెట్టారు.




