
తన విలువైన వోక్స్ వాగన్ కారు బానిట్ పై అదిరిపోయే రేంజ్ లో ‘కబాలి’ రజనీకాంత్ పోస్టర్ ను పెట్టి, కారు లుక్ నే మార్చివేశాడు ఒక అభిమాని. బహుశా ఈ ఫోటో చూస్తే వోక్స్ వాగన్ సంస్థ కూడా అధికారికంగా తమ కార్లను ఇలా విడుదల చేస్తే బాగుంటుందనే విధంగా ఈ స్టిల్ ఉండడంతో సోషల్ మీడియాలో రజనీ అభిమానులు ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.
మరో చోట తన కారుకు వచ్చిన నెంబర్ ను ‘కబాలి’గా మార్చివేశాడు మరో అభిమాని. కర్ణాటకకు చెందిన ఓ అభిమాని తన ఆడి కారు అసలు నెంబర్ ‘కేఎ 8 ఎఎల్ 1’ను కాస్త ‘కబాలి’ అంటూ ఇంగ్లీష్ లెటర్స్ లో రాయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇలా కోట్లు పెట్టి కొన్న కార్లు ‘కబాలి’ సినిమాకు ప్రమోషన్లుగా మారిపోవడం బహుశా ‘సూపర్ స్టార్’ వల్ల మాత్రమే అయ్యే విషయమని చెప్పవచ్చు.
The much-awaited trailer of Don’t Trouble The Trouble is finally out after its grand launch…
Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…