వైసీపీ ‘పాన్ ఇండియా’ అరాచకాలు..!

ఏపీలో రాజన్న రాజ్యం సృష్టిస్తాం, పాలనలో సంక్షేమానికి పెద్ద పిట వేస్తాం, ఆడపడుచులకు అండగా ఉంటాం…ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ తన సోదరి షర్మిలతో కలిసి పాదయాత్రలు చేసిన జగన్ కు ప్రజలిచ్చిన ఒక్క ఛాన్స్ ను ఎంత దారుణంగా వాడుకున్నారో తెలుసుకుంటే ఓటరు సైతం ఈ పాపాలకు మనం కూడా భాగస్వాములమే కదా అనే ఆలోచనలోకి వచ్చేస్తారు.

ADVERTISEMENT

వైసీపీ పాలన విధానాల మీద, వారి ప్రభుత్వ నిర్ణయాల మీద ఇన్నాళ్లుగా చర్చలు జరిగినప్పటికీ బయట ప్రపంచానికి తెలిసిన నిజాలు కొన్నే ఇంకా బయటకు వస్తున్న, రావాల్సిన వాస్తవాలు మరెన్నో అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎదుటి వారి వ్యక్తిగత జీవితాలను రాజకీయ వేదికల మీద చర్చకు ఉంచి వారి కుటుంబాలను మానసిక వేదనకు గురి చేసిన వైసీపీ ఇప్పుడు కుటుంబ రాజకీయాలతో, వ్యక్తిగత వివాదాలతో బజారుకెక్కింది.

గంట అరగంట నుంచి, మాధవ్ విన్యాసాల వరకు ఒక ఘట్టంగా వైసీపీలో ఒక చీకటి కోణం వెలుగులోకి వస్తే, ఇప్పుడు అంతకు మించి అనేలా వయస్సు తో సంబంధం లేకుండా ప్రాంతాలతో పరిమితం కాకుండా వైసీపీ అరాచకం అమరావతి నుంచి ముంబయి వరకు విస్తరించినట్లు వస్తున వార్తలు ఏపీ ప్రభుత్వానికి తలవంపుగా మారాయి.

జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఏకీభవించని అమరావతి రైతు కుటుంబాల మహిళ ల పట్ల అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకుని అవమానించిన వైనం ఇంకా చెరిగిపోకముందే ఇప్పుడు ముంబై లోని ఒక బాలీవుడ్ నటి పై వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి చేసిన అరాచకం తాజాగా వెలుగులోకి వచ్చింది.

జత్వానీ అనే బాలీవుడ్ నటి పై వైసీపీ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ అధికారులను వాడుకుని చేసిన పైసాచికత్వం ఒక టీవీ కార్యక్రమంలో స్వయంగా బాధితురాలే వెలుగులోకి తీసుకు రావడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మీద సరైన విచారణ చేసి తప్పు జరిగిందని నిర్దారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు తనను తన కుటుంబాన్ని మానసికంగా వేధించాడని, తనకు న్యూడ్ వీడియోలు పంపించి హింసించారని జత్వానీ మీడియా సాక్షిగా తన వద్ద ఉన్న సాక్ష్యాలను ప్రజల ముందుంచారు. మొన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మీద వచ్చిన ఇటువంటి ఆరోపణలకు పొంతన లేని సమాధానాలు చెప్పి నవ్వుల పాలయినట్లు నేడు కుక్కుల విద్యాసాగర్ కూడా తన ఫోటోలను మార్ఫింగ్ చేసారు అంటూ వాపోతారేమో చూడాలి మరి.

తన పట్ల జరిగిన దారుణాలకు అప్పటి ప్రభుత్వ అధికారులు కూడా ముఖ్య పాత్ర వహించినట్లు జత్వాని చెప్పుకొచ్చారు. ఉన్నత స్థానంలో ఉండి ప్రజలను రక్షించాల్సిన అధికారులే ఇలా రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తూ వైసీపీ పద్మవ్యూహంలో చిక్కుకుంటే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు రాజకీయ నాయకులతో ఆగలేదని, అది ఒక్కో వ్యవస్థలోకి చాప కింద నీరులా ప్రవేశించి రాష్ట్ర పరువును బజారున పడేసిందని చాల లేటుగా తెలుసుకోవాల్సిన పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు జగన్.

సరిగ్గా ఎన్నికలకు రెండు నెలలు ముందు జత్వాని కుటుంబాన్ని సినిమాలో మాదిరి రహస్యంగా కిడ్నాప్ చేసి వేధించడం, ఆమె మీద అక్రమ కేసులు బనాయించి బెదిరించడం, అందునా ఇదంతా కూడా విజయవాడ కేంద్రంగా జరగడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తనకు కావాల్సిన వారి కోసం ఎవరినైనా బలి చేయడానికి జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించరని ఈ సంఘటనతో మరోసారి రుజువయ్యింది.

తనకు అడ్డొస్తే సొంత చెల్లిని తల్లినే ఉపేక్షించలేని జగన్ కు జత్వానీ పెద్ద విషయమా.? అంటూ వైసీపీ తీరుని తప్పుబడుతున్నారు టీడీపీ శ్రేణులు. ఇందులో వైసీపీ ముఖ్య సలహాదారుని ప్రమేయం అధిక పాత్రలో ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వైసీపీ కి వ్యతిరేకంగా గళం విపినందుకే పవన్ మీద ఉన్నకక్ష్యను వేలాది మందికి ఉపాధి కలిపించే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చూపించారు జగన్.

ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు అటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపిస్తూ పాన్ ఇండియా మూవీగా తెలుగు సినిమా విస్తరించింది. అయితే ఈ ఇండస్ట్రీని జగన్ ఆదర్శంగా తీసుకుని తన వైసీపీ పార్టీ అరాచకాలు కూడా పాన్ ఇండియా స్థాయికి విస్తరించారా అన్నట్టుగా వైసీపీ అరాచకాలు టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్థాయికి చేరుకున్నాయి. అయితే దీనికి వైసీపీని అభినందించాలో లేక ఏపీ పరువు ఇక్కడ నుండి అక్కడి దాక దిగజార్చారు అని బాధపడాలో అర్ధం కానీ స్థితిలో రాష్ట్రం మరోసారి తలదించుకుంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీకి ఈ నమ్మకం కల్పించింది కూటమి పార్టీలే కదా?

స్థానిక సంస్థల ఎన్నికలలో మేయర్, మున్సిపల్ చైర్మన్‌, చైర్ పర్సన్ సీట్ల కోసం కూటమిలో మూడు పార్టీలు పట్లు పట్టాల్సిరావడం…

27 minutes ago

YSRCP Files Two Petitions in High Court Ahead of AP Local Body Elections

With local body elections approaching in Andhra Pradesh, the YSR Congress Party (YSRCP) has filed…

28 minutes ago