
బిఆర్ఎస్ లో తనకు ఒక్కడే నాయకుడు, అది కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ ను తప్ప మరెవ్వరిని నేను నాయకుడిగా అంగీకరించేది లేదు అంటూ నాడు కవిత చేసిన వ్యాఖ్యలను నేడు బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోరకంగా బలపరుస్తున్నారు.
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కి నాయకత్వ లక్షణాలు లేవని, దాని ఫలితమే అనేకమంది బిఆర్ఎస్ నాయకులు పార్టీకి దూరమ్యయారని, కేటీఆర్ నాయకత్వం కింద బిఆర్ఎస్ ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయిందంటూ కేటీఆర్ టార్గెట్ గా విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు కడియం.
అహంకారం అధికారాన్ని ఇవ్వదని, ముఖ్యంగా ఒక పార్టీని నడిపే వ్యక్తికీ ఇటువంటి అహంకారం తగదు అంటూ చెప్పుకొచ్చిన కడియం ఇదంతా కేటీఆర్ ను రెచ్చకొట్టేందుకు చేస్తున్నారా.? లేక కవితను మచ్చిక చేసుకునేందుకు వాడుతున్నారా.? అనేది తెలియాలి.
ఎందుకంటే కడియం వ్యాఖ్యలు పరోక్షంగా కవిత ప్రకటనలను బలపరుస్తున్నాయి. అలాగే కడియం కూడా కవిత మాదిరే బిఆర్ఎస్ ఉనికి పై కూడా అనుమానాలు లేవనెత్తారు. బిఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వబోతుంది, ఆ దిశగా బిఆర్ఎస్ లో ఉన్న కోవర్టులు కేసీఆర్ కి కట్టప్పలుగా మారనున్నారు అంటూ కవిత హరీష్ ని ముందుకు తెచ్చింది.
అలాగే కడియం కూడా పార్టీ కేసీఆర్ చేతిలో ఉన్నన్ని రోజులు మాత్రమే హరీష్ బిఆర్ఎస్ కోసం పని చేస్తారని, ఆ పై బిఆర్ఎస్ ముక్కలుగా చీలుతుంది అంటూ బిఆర్ఎస్ భవిష్యత్ పై జోస్యం చెప్పుకొచ్చారు, ఇక హరీష్ పాత్ర పై కూడా అనుమానులు పుట్టించారు.
ఈ పరిణామాలన్నీ గమనిస్తే కడియం పూర్తిగా కాంగ్రెస్ వాదిగా మారేందుకు కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ హస్తం క్యాడర్ మనసు గెలవాలనుకుంటున్నారా.? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పారీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల విషయంలో స్పీకర్ తీసుకునే తుది నిర్ణయం రాజీనామా అయితే అందుకు కడియం ఇప్పటి నుంచే తన గెలుపుకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టే అనుకోవాలా.?
Lyca Productions has finally dropped an update regarding Kamal Haasan's Indian 3, stating that Senapathy…
The NDA leadership in Andhra Pradesh has repeatedly raised concerns about alleged attempts to create…