సమంత ‘సింగిల్’కు వ్యతిరేకంగా కాజల్!

kajal-about-her-hubby‘నేను సింగిల్ గా ఉన్నానని ఎవరన్నారు?’ అంటూ ప్రేక్షకుల ‘కుందనపు బొమ్మ’ సమంత అంటే, తాజాగా ఆడియన్స్ ‘చందమామ’ కాజల్ కూడా ‘సింగిల్’పై స్పందించింది. ‘మూడేళ్ల నుండి సింగిల్ గా ఉంటున్నానని’ చెప్పి అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. అంటే, మూడేళ్ల క్రితం వరకు ఎవరితో ప్రేమలో మునిగి తేలిందో అంటూ గుసగుసలు మొదలయ్యాయి.

మళ్లీ నచ్చిన వ్యక్తి దొరికితే పీకల్లోతు ప్రేమలో మునిగిపోతానని చెప్పిన కాజల్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పింది. వేరే రంగానికి చెందిన వ్యక్తి అయితే అనుబంధం పెరుగుతుందని, రియల్ లైఫ్‌ లో తానంత రొమాంటిక్ కాదని, అందుకే నిద్రలేచిన దగ్గర్నుంచి ‘ఐ లవ్ యూ’ చెప్పడం తన వల్ల కాదని తెలిపింది.

ADVERTISEMENT

తనకు నచ్చినట్టుగా ఉంటానని, మంచి అవగాహన ఉంటే చాలని తెలిపింది. అయితే, దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో ఉందని గతంలో బాలీవుడ్ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపించిన వైనం తెలిసిందే. మరి ఆ ప్రేమ మున్నాళ్ళ ముచ్చటగానే మారిందా… అంటూ కాజల్ లేటెస్ట్ స్టేట్మెంట్స్ పై కామెంట్స్ పడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories