‘బ్రహ్మోత్సవం’ లీకేజ్ పై కాజల్ ‘డేంజర్’ సిగ్నల్స్!

Kajal Aggarwal about brahmostavamఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు సంబంధించి ప్రతి చిన్న అంశం లీకేజ్ ద్వారా వెలుగు చూస్తున్న వైనం తెలిసిందే. ‘బ్రహ్మోత్సవం’ కూడా దీనికేమి మినహాయింపు కాదన్న విధంగా ఇటీవల ‘కధ’ మొత్తం ఇంటర్నెట్లో, వెబ్ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే. రైలులో పరిచయమైనా సమంత ఫస్ట్ లుక్ లో మహేష్ ను ప్రేమించగా, అంతకుముందే మహేష్ ఎన్ఆర్ఐగా కాజల్ ను ప్రేమించడం అలా ఉంచితే, తండ్రి చివరి మాటలో భాగంగా ప్రణీతను మహేష్ పెళ్లి చేసుకోవాలనుకోవడంపై… త్రికోణ ప్రేమకధగా ‘బ్రహ్మోత్సవం’ సిద్ధమవుతోందని హల్చల్ చేసింది.

నిజమో, అబద్ధమో తెలియని ఈ కధాకమామీషు పక్కన పెడితే, తాజాగా ‘చందమామ’ కాజల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర తీరుతెన్నులు గురించి చెప్పుకొచ్చింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో తను ఓ ‘ఎన్ఆర్ఐ’ పాత్రలో కనిపిస్తున్నానని, మోడ్రన్ గా ఉంటూనే విలువలకు ప్రాధాన్యమిచ్చే పాత్ర అని, ఒక రకంగా, తన నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్ర ఇదని… చెప్పుకొచ్చింది. దీంతో ఇంతకుముందు లీక్ అయిన కధను పోల్చిచూస్తే… కాజల్ చెప్పిన విషయాలు, లీక్ అయిన కధ ఒకే విధంగా ఉండడంతో ‘బ్రహ్మోత్సవం’ లీకేజ్ కధకు సంబంధించి డేంజర్ సిగ్నల్స్ మ్రోగుతున్నాయి.

ADVERTISEMENT

అదే నిజమైతే… ‘బ్రహ్మోత్సవం’ కధ ఇంత సింపుల్ గా ఉంటుందా? ఈ కధతో ప్రేక్షకులను రెండున్నర్ర గంటల పాటు కట్టిపడేయడం సాధ్యమేనా? లాంటి ప్రశ్నలు ప్రిన్స్ అభిమానుల్లో నెలకొంటున్నాయి. నిజానికి శ్రీకాంత్ అడ్డాల గత సినిమాలను పరిశీలిస్తే… కధ కొంచెమే ఉన్నా, ఆకట్టుకునే సన్నివేశాలతో ఆహ్లాదకరంగా తీయడం అడ్డాల స్పెషాలిటి. మరి ‘బ్రహ్మోత్సవం’ కూడా అలాగే ఉండబోతోందా..? అంటే ఇప్పుడే చెప్పలేం గానీ, ప్రస్తుతం అందరి చూపులు ఆడియో వేడుకపైనే ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories