
టీడీపీ – జనసేన పొత్తు కారణంగా ఉదయ గోదావరి జిల్లాలలో లెక్కలు మారబోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న బలంతో పాటు ఇక్కడ కాపు సామాజిక వర్గం కారణంగా జనసేన కూడా స్ట్రాంగ్ గా ఉంది.
దీనితో రెండు జిల్లాలలోని 35 సీట్లు, అలాగే ఎంపీ సీట్లు మెజారిటీ టీడీపీ – జనసేన ఖాతాలోకే అని ఆ పార్టీలు ధీమాగా ఉన్నాయి.
ఆ పార్టీలను తట్టుకుని నిలబడటానికి వైఎస్సార్ కాంగ్రెస్ తిప్పలు పడుతుంది. కాపు ఉద్యమాన్ని ముందుకు నడిపిన ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకుని కాకినాడ ఎంపీగా నిలబెట్టాలని జగన్ ఆలోచన.
గతంలో టీడీపీ తరపున పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ అధికార పార్టీలోకి చేరారు.
కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో జనసేన కు ఈ సీటు ఆశిస్తుంది. రెండు పార్టీలలోని ఆశావహుల లిస్టు పెద్దగానే ఉంది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తారని వినిపిస్తుంది. ఆయన గనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే కాకినాడ చాలా తేలికైన సీటు.
వ్యాపారవేత్త సతీష్ బాబు సానా అనే అభ్యర్థి పేరు ముందు ఉన్నట్టు వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన ఆయన లోకల్ కోటాలో కాకినాడ సీటు ఆశిస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలో మంచి పనులు చేస్తూ తన పేరు మీద ఫౌండేషన్‌ను నడుపుతున్నాడు.
ఒకవేళ ఆ సీటు టీడీపీ కి వెళ్లినా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. ఆయన టీడీపీ అగ్రనాయకత్వానికి కూడా దగ్గరయ్యారు. తూర్పుగోదావరిలో నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో చురుకైన పాత్ర పోషించారు.
సైకిల్ పార్టీకి సీటు కేటాయిస్తే కూడా టీడీపీ అభ్యర్థిగా నేనే అని ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏ రకంగా చూసినా సీట్ కంఫర్మ్ అంటున్నారు.
The latest poster of Vrushakarma features Naga Chaitanya holding a distinctive weapon against a mysterious…
The popular reality show The Traitors is making its Telugu debut with Prime Video’s The…