Telugu

వాడేసిన ఆ అస్త్రం ఉపయోగపడదని కవితకి ఎవరైనా చెప్పండర్రా

తెలంగాణ ఉద్యమాలతో ప్రాంతీయవాదానికి పురుడు పోసిన బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌, అధికారంలో ఉన్న పదేళ్ళలో దానిని పెంచి పోషించారు.

చెట్టంత కొడుకు కేటీఆర్‌ చేతికి అందివచ్చినప్పటికీ, అయన కూడా తండ్రి పేరుతోనే ఇంకా రాజకీయాలు చేస్తున్నారు. కనుక వారిద్దరికీ కూడా ఈ ప్రాంతీయవాదమే చేతికి అందివచ్చిన కొడుకులా ఉపయోగపడుతోంది.

ADVERTISEMENT

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి ఇంకా కొడుకు చేతికి అంది రాలేదు కానీ ఆమెకు కూడా ఈ ప్రాంతీయవాదమే చేతికి అంది వచ్చిన కొడుకులా ఉపయోగపడుతోంది.

కనుక ఆమె దానిని ఎడాపెడా వాడేసుకుంటూ తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు.

ఇటీవల హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో నియామకాల గురించి కల్వకుంట్ల కవిత మాట్లాడుతునప్పుడు, పనిలో పని అన్నట్లు అదే చేత్తో ఓ బాణం ఆంధ్రాపై కూడా వేశారు.

“ఆంధ్రాలో పుట్టి ఇక్కడ చదువుకున్న ఆంధ్రా పిల్లలకు మనం ఉద్యోగాలు ఇస్తున్నాం. కానీ ఇక్కడ పుట్టి ఆంధ్రాలో చదువుకున్న మన పిల్లలకి అక్కడ ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వరు కదా?మరి ఆంధ్రా పిల్లలకి మనమెందుకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలి మనం?” అని ప్రశ్నించారు.

ఇదే ప్రశ్న గతంలో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం కూడా అడిగేది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అడుగుతోంది. అమెరికాలో ట్రంప్‌, గల్ఫ్ దేశాలలో యువత కూడా అడుగుతున్నారు. వారి ప్రశ్నలకు ఆమె వద్ద సమాధానం ఉన్నట్లయితే, ఆమె ప్రశ్న సహేతుకమే.

కానీ దేశంలో ఇతర రాష్ట్రాలలో, అమెరికా, గల్ఫ్ దేశాలతో సహా పలు దేశాలలో తెలంగాణ కార్మికులు, ఇంజనీర్లు, వైద్యులు, ఐటి నిపుణులు పనిచేస్తున్నప్పుడు, తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా ఏపీ యువతకు చోటు లేదన్నట్లు కల్వకుంట్ల కవిత మాట్లాడటం ఆమె కరడు గట్టిన ప్రాంతీయ వాదానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

తెలంగాణ ప్రజలు తనని, తన పార్టీని గుర్తించి ఆదరించాలంటే ఆమెకు మరోదారి లేదు. కనుక తండ్రి తయారుచేసి అందించిన ప్రాంతీయవాదమనే పాశుపతాస్త్రాన్ని ఈవిధంగా వాడుకుంటూ తెలంగాణ యువతని ఆకట్టుకోవాలనుకుంటున్నారు.

కానీ ఆమె ఆరాటం ఫలించకపోవచ్చు. ఎందువల్ల అంటే తెలంగాణ బరిలో కాంగ్రెస్‌తో రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌ పార్టీతో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, బిజేపితో ప్రధాని మోడీ, అమిత్ షా, బండి సంజయ్‌ వంటి హేమాహేమీలున్నారు.

కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు, కర్ణుడు ఇద్దరి చేతిలో దివ్యస్త్రాలున్నప్పటికీ అవి కర్ణుడుకి ఉపయోగపడలేదు. అదేవిధంగా ఈ ప్రాంతీయవాదమనే పాశుపతాస్త్రం ఎవరో ఒక్కరికే, ఒక్కసారే ఉపయోగపడుతుంది తప్ప ప్రతీసారి ప్రతీ ఒక్కరికీ కాదు.



Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

16 minutes ago

Amaravati Railway Line Likely by 2028-29, Tenders Progress

Amaravati could get railway connectivity by late 2028 or early 2029 through a 57-km railway…

16 minutes ago