
రాజకీయాలు చేయాలంటే ధైర్యం ఉండాలని చెప్పిన కల్వకుంట్ల కవిత ఆచరణలో చూపిస్తున్నారు. తండ్రి, అన్న, బావ నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నున్చీ బహిష్కరణకు గురైతే ఆమె ఏమీ నిరాశతో క్రుంగిపోలేదు. రాజకీయాలలో మహిళలను ఎదగనీయరంటూ రాజకీయాల నుంచి తప్పుకోలేదు. వెంటనే జాగృతిని మళ్ళీ యాక్టివేట్ చేసి దాంతో రాజకీయాలు మొదలుపెట్టారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. కనుక కవిత కొత్తగా పార్టీ పెట్టడం అంటే దుస్సాహసమే అని చెప్పాలి. ముఖ్యంగా మహిళ నాయకత్వం నడిచే పార్టీలో కొమ్ములు తిరిగిన పురుష నాయకులు చేరేందుకు ఇష్టపడతారా లేదా?చేరకపోతే తన పార్టీ పరిస్థితి ఏమిటని కల్వకుంట్ల కవిత బాగా ఆలోచించుకునే ఉంటారు. అయినా కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు.. అంటే ధైర్యంగా రాజకీయాలు చేస్తున్నట్లే.
ఆమె తాజా ఇంటర్వ్యూలో “కేసీఆర్‌గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు. ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను. కొత్త పార్టీ పెట్టుకుంటున్నాను. కనుక నా పార్టీలో ఆయన ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది సబబు కాదు కూడా. మా కొత్త పార్టీ కార్యాలయంలో తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో, తెలంగాణ తల్లి ఫోటోలు పెట్టుకుంటాము.
కేసీఆర్ పేరు, ఫోటో లేకుండానే ప్రజల వద్దకు వెళ్తాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారో తిరస్కరిస్తారో వారిష్టం,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ అంటే కేసీఆర్… బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అనే పరిస్థితి ఓ పక్క. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో దూసుకుపోతూ నానాటికీ బలపడుతోంది. మరో పక్క ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజేపి ఉంది.
ఇలాంటి పరిస్థితిలో కల్వకుంట్ల కవిత ఇంత ధైర్యంగా ఈ మాట చెప్పడం చాలా సాహసమే. రెండుసార్లు మంత్రిగా చేసి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న కేటీఆర్ నేటికీ తండ్రి కేసీఆర్ భజన చేస్తుంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు.
తెలంగాణ రాజకీయాలలో ఒంటరి పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత తండ్రి నీడ నుంచి బయటపడి తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బహుశః త్వరలోనే తన పేరులో ‘కల్వకుంట్ల’ లేబుల్ కూడా తొలగించుకొని భర్త ఇంటి పేరు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. అప్పుడే ఆమె మాటలకు పరిపూర్ణత ఏర్పడుతుంది.
మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఒకవేళ ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి పోయుంటే, ఆమెకు ఇంత ధైర్యం, తెగువ ఉన్నాయనే విషయం ఎన్నటికీ ఎవరికీ తెలిసేదే కాదు కదా?
కనుక ‘సంస్కారవవంతమైన సబ్బులున్నప్పుడు మరక మంచిదే’ అన్నట్లు బహిష్కరణ వేటు కూడా ఆమె శక్తి సామర్ధ్యాలు నిరూపించుకునేందుకు గొప్ప అవకాశం కల్పించిందని చెప్పాలి.
Ridhima Tiwari gives ivory dressing a fearless fashion refresh in this striking photo set. Draped…
Shah Rukh Khan's King already has one of the biggest ensemble casts among upcoming Hindi…