
రేపు ఉదయం 10 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వద్ద ఉన్న ఒక ఫంక్షన్ హాల్ లో జాగృతి అధ్యక్షరాలు, కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో అందరి చూపు కవిత కొత్త పార్టీ ప్రకటన మీదే ఉంది.
కవిత తన పార్టీ రిలీజ్ సందర్భంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, తన ప్రసంగం ఎవరి టార్గెట్ గా ముందుకు సాగబోతోంది, పార్టీ విధివిధానాలు, పార్టీలో ఎవరు జాయిన్ అవ్వబోతున్నారు ఇలా అనేక కీలక అంశాల మీదే కవిత కొత్త పార్టీ రివ్యూ ఆధారపడి ఉంటుంది.
అయితే కేసీఆర్ లాంటి బలమైన తెలంగాణ రాజకీయ నేతను కాదని, హరీష్ రావు వంటి ప్రజాదరణ కలిగిన నేత పై బలమైన రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేస్తూ, బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్న కేటీఆర్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ కవిత సాగిస్తున్న రాజకీయం బిఆర్ఎస్ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని ఆ పార్టీలోని చోటామోటా నాయకుల వరకు తన పై విమర్శలు చేసినా ఇప్పటికి టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్ పై పల్లెత్తి మాట అనలేకపోతున్నారు. కానీ నిన్నమొన్నటి వరకు బిఆర్ఎస్ మహిళా నేతగా ఉన్న కవిత మాత్రం కేసీఆర్ కి వ్యతిరేకంగా కూడా ప్రకటనలు చేస్తున్నారు.
అయినా కూడా బిఆర్ఎస్ మాత్రం కవిత ప్రకటనల పై ఎదురుదాడి చేసేందుకు వెనకడుగు వేస్తూనే వస్తుంది. అటువంటి కవిత ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటన తరువాత బిఆర్ఎస్ పై దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు నుంచి బీసీ రిజర్వేషన్ అంశం వరకు, తెలంగాణ ప్రాంతీయవాదం నుంచి బీజేపీ జాతీయవాద రాజకీయాల వరకు ప్రతి అంశం మీద కవిత ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది.
పార్టీ పేరు ప్రకటన రోజు కవిత కొత్త పార్టీలో అడుగుపెట్టే నేతల ఎవరు.? వారి ఏ పార్టీ నుంచి వలస వస్తారు.? అసలు వస్తారా.? అనేది కూడా తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది. రేపు సూర్యోదయం తరువాత తెలంగాణ రాజకీయాలలోకి మరోకొత్త పార్టీ ఆవిర్భవించనుంది.
అలాగే రేపటి సూర్యాస్తమయానికి ఆ కొత్త పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన రివ్యూ కూడా బయటకు రానుంది. మరి తెలంగాణ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పండితులు, సీనియర్ రాజకీయ నాయకులు, మీడియా, సోషల్ మీడియా కవిత కొత్త పార్టీ పేరుకి, జెండాకు, ఎజెండాకు ఎంత రేటింగ్ ఇస్తారో అనేది వేచి చూడాలి.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…
Sanjay Dutt faced severe criticism after a recent appearance on Shekhar Suman’s show. His comments…