నాని, నిత్యామీనన్ లతో తీసిన ‘అలా మొదలైంది…’ సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన నందినిరెడ్డి ఆ తర్వాత సిద్ధార్ద్, సమంతలతో తెరకెక్కించిన ‘జబర్దస్త్’ చిత్రంతో కనుమరుగయ్యారు. చాలా కాలం తర్వాత మళ్ళీ “కళ్యాణ వైభోగమే” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి 35 సెకన్ల తొలి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
యువ హీరో నాగ శౌర్య, ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ టీజర్ ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు “చాలా చక్కగా ఉంది” అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ టీజర్ చూసిన తర్వాత అదే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవ్వడం సహజమే. కన్నుల పండుగగా రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి, ఒకప్పటి భారీ అందాల భామ రాశి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆకట్టుకునే నాగ శౌర్య, మాళవిక లుక్ లతో పాటు వినసొంపైన సంగీతం ఉన్న “కళ్యాణ వైభోగమే” టీజర్ వీక్షకుల కోసం…





