
తమిళనాడులో జయలలిత, కరుణానిధి శకం ముగిసిన తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతని అందిపుచ్చుకోవాలని ప్రముఖ నటుడు కమల్ హాసన్ 2018లో మక్కల్‌నీది మయ్యం అనే రాజకీయ పార్టీ స్థాపించారు. కానీ అప్పటి నుంచి పోటీ చేసిన ప్రతీ ఎన్నికలలో ఆయనతో సహా పార్టీ అభ్యర్ధులు అందరూ ఓడిపోతూనే ఉన్నారు. డిపాజిట్లు కూడా రావడం లేదు.
కనుక కమల్ హాసన్ పార్టీ మూసేసి రాజకీయాల నుంచి తప్పుకోక తప్పదని అందరూ భావిస్తున్నప్పుడు, ఆయనకు అనూహ్యంగా డీఎంకే పార్టీ ఓ ఆఫర్ ఇచ్చింది.
2021 లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోవడం కంటే కాంగ్రెస్-డీఎంకే కూటమికి మద్దతు ఇస్తే రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కమల్ హాసన్ ఆ ఆఫర్ స్వీకరించి పోటీ నుంచి తప్పుకొని వాటికి మద్దతు ఇచ్చారు.
ఆ హామీ ప్రకారం డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల ఆయనకు రాజ్యసభ టికెట్ కేటాయించారు. డీఎంకే ఎమ్మెల్యేల ఓట్లతో ఆ సీటు గెలుచుకున్న కమల్ హాసన్ ఈ నెల 25న రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
మక్కల్‌నీది మయ్యం అంటే ప్రజలకు న్యాయం చేసే పార్టీతో ప్రజలకు, ఆయననే నమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన వారికి ఏమీ న్యాయం, లాభం కలుగలేదు కానీ కమల్ హాసన్‌కు మాత్రం న్యాయం జరిగింది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…